టెక్నాలజీ సాయం...ఎన్నో వస్తువులు మాయం!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ వస్తువులు మరింత చిన్నగా మారిపోతున్నాయి. కొన్ని వస్తువులు పూర్తిగా మాయమైపోతున్నాయి. మన కళ్లముందే కంప్యూటర్ ల్యాప్‌టాప్‌గా, ల్యాప్‌టాప్ టాబ్లెట్‌గా, టాబ్లెట్ ఫాబ్లెట్ (స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్ కలిపి)గా మారిపోయాయి. కొత్తరూపంలో వచ్చే గాడ్జెట్స్ తక్కువ పరిమాణంలో ఉండి ఎక్కువ ఫీచర్స్ ని ఇస్తున్నాయి. తినే తిండి, నిద్రపోయే మంచం లాంటివాటిని వర్చువల్ రూపంలోకి మార్చలేము కానీ, మన జీవితంలో చాలా అంశాలను టెక్నాలజీ, భౌతిక రూపం నుంచి సిస్టమ్‌లో కనిపించే చిత్రాలుగా మార్చేసింది. నిత్య జీవితంలో మనం వెళ్లి చేయాల్సిన […]
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎలక్ట్రానిక్ వస్తువులు మరింత చిన్నగా మారిపోతున్నాయి. కొన్ని వస్తువులు పూర్తిగా మాయమైపోతున్నాయి. మన కళ్లముందే కంప్యూటర్ ల్యాప్‌టాప్‌గా, ల్యాప్‌టాప్ టాబ్లెట్‌గా, టాబ్లెట్ ఫాబ్లెట్ (స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్ కలిపి)గా మారిపోయాయి. కొత్తరూపంలో వచ్చే గాడ్జెట్స్ తక్కువ పరిమాణంలో ఉండి ఎక్కువ ఫీచర్స్ ని ఇస్తున్నాయి. తినే తిండి, నిద్రపోయే మంచం లాంటివాటిని వర్చువల్ రూపంలోకి మార్చలేము కానీ, మన జీవితంలో చాలా అంశాలను టెక్నాలజీ, భౌతిక రూపం నుంచి సిస్టమ్‌లో కనిపించే చిత్రాలుగా మార్చేసింది. నిత్య జీవితంలో మనం వెళ్లి చేయాల్సిన పనులను యాప్స్ చేసేస్తున్నాయి.
అలాగే ఆఫీస్ టేబుల్ రూపురేఖలను టెక్నాలజీ సమూలంగా మార్చేసింది. ఆఫీస్ టేబుల్ అంటే…ఒక సిస్టమ్, ప్యాడ్, పేపర్లు, పుస్తకాలు, పెన్నులు, ఎన్‌వలప్స్, పిన్ మిషన్, గమ్‌బాటిల్, ల్యాండ్ ఫోను, ఫ్యాక్స్ మిషన్, ఓ గ్లోబు, క్యాలిక్యులేటర్, గోడకో కార్క్ బోర్డు, డిక్షనరీ, ఎన్‌సైక్లోపీడియా….ఇలా చాలా ఉంటే గానీ అది ఆఫీస్ టేబుల్ కాదు. కానీ వీటన్నింటినీ ఒక్క ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్ భర్తీ చేసేస్తున్నాయిప్పుడు. మనకు కావాలసిన సమాచారమంతా ల్యాప్‌టాప్, ఫోనుల్లోనే ఉంటోంది. మనం పంపాల్సిన సమాచారం అంతా వాటిలోంచే వెళ్లిపోతోంది. రావాల్సిన సమాచారం కూడా అదే మార్గంలో వస్తోంది. ఇక వస్తువులతో పనేముంది. ఇదే విషయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ హార్వర్డ్ ఇన్నోవేషన్ ల్యాబ్, ఓ షార్ట్ వీడియోని రూపొందించింది. ది ఎవల్యూషన్ ఆఫ్ ది డస్క్ పేరుతో వచ్చిన ఈ వీడియోలో 1980ల నుండి 2014 వరకు మారిన టెక్నాలజీ, ఆఫీస్ టేబుల్‌ని ఎలా మార్చివేస్తూ వచ్చిందో, వస్తువులు మారిపోయి ల్యాప్‌టాప్‌లో యాప్స్‌గా ఎలా మారిపోతూ వచ్చాయో చూపించారు.