సౌరశక్తి వెలుగులే దేశానికి దివిటీలు: మోడి
వాతావరణ సమతౌల్యాన్ని పాటించడంలో భాగంగా భారతీయులంతా సౌరశక్తిని వినియోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి పిలుపు ఇచ్చారు. జార్ఖండ్‌లోని ఖుంతీలో పూర్తిగా సౌరశక్తితో నిర్వహించే ఓ న్యాయస్థానాన్ని మోడీ ప్రారంభిస్తూ సాంప్రదాయ విద్యుత్ వనరులు అందుబాటులో ఉన్న జార్ఖండ్‌లో ప్రజలు సౌరశక్తి కోసం ప్రయత్నించడం, అమలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుకు మార్గాలు అన్వేషించాలని, సాధ్యమైనంత మేరకు పొదుపును పాటించాలని కోరారు. విద్యుత్ పొదుపు వల్ల […]
వాతావరణ సమతౌల్యాన్ని పాటించడంలో భాగంగా భారతీయులంతా సౌరశక్తిని వినియోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడి పిలుపు ఇచ్చారు. జార్ఖండ్‌లోని ఖుంతీలో పూర్తిగా సౌరశక్తితో నిర్వహించే ఓ న్యాయస్థానాన్ని మోడీ ప్రారంభిస్తూ సాంప్రదాయ విద్యుత్ వనరులు అందుబాటులో ఉన్న జార్ఖండ్‌లో ప్రజలు సౌరశక్తి కోసం ప్రయత్నించడం, అమలు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపుకు మార్గాలు అన్వేషించాలని, సాధ్యమైనంత మేరకు పొదుపును పాటించాలని కోరారు. విద్యుత్ పొదుపు వల్ల డబ్బు ఆదా అవడంతోపాటు భవిష్యత్ తరాలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. సౌరశక్తి వినియోగం వల్ల సాంప్రదాయ విద్యుత్ వనరులపై ఒత్తిడి తగ్గుతుందని ఆయన గుర్తు చేశారు. భూతాపానికి భారతదేశం కారణం కానప్పటికీ దాన్ని తగ్గించేందుకు మన ప్రయత్నం చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ దీన్ని కర్తవ్యంగా భావిస్తే భావితరాలు సుఖపడతాయని అన్నారు. విద్యుత్ పొదుపు చేయడానికి విపణిలో అనేక పరికరాలు వచ్చాయని, వీటిని ఉపయోగించి సాధ్యమైనంత వరకు పొదుపు పాటించాలని, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాలని మోడి కోరారు.