రిషితేశ్వరి కేసు నిందితులకు బెయిల్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్శిటీ ఆర్కెటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. నిందుతులు హనీషా, శ్రీనివాస్, జయచరణ్‌లకు గుంటూరుజిల్లా ఒకటో అదనపు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.10 వేల రూపాయల పూచికత్తుతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. పాస్‌పోర్టు ఉంటే అప్పగించాలని ఆదేశించారు. నెల రోజుల పాటు యూనివర్శిటీలోకి అడుగు పెట్టకుండా కోర్టు ఆంక్ష విధించింది. నెల పాటు ప్రతి రోజు ఉదయం 10-11 గంటల మధ్యలో పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు […]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగార్జున యూనివర్శిటీ ఆర్కెటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. నిందుతులు హనీషా, శ్రీనివాస్, జయచరణ్‌లకు గుంటూరుజిల్లా ఒకటో అదనపు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.10 వేల రూపాయల పూచికత్తుతో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు.
పాస్‌పోర్టు ఉంటే అప్పగించాలని ఆదేశించారు. నెల రోజుల పాటు యూనివర్శిటీలోకి అడుగు పెట్టకుండా కోర్టు ఆంక్ష విధించింది. నెల పాటు ప్రతి రోజు ఉదయం 10-11 గంటల మధ్యలో పెదకాకాని పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాల్సిందిగా ఆదేశించింది. ఇదివరకు నిందితుల బెయిల్ పిటిషన్‌ను కోర్టు రెండుసార్లు తిరస్కరించింది. ముగ్గురు నిందితులు 77 రోజుల పాటు రిమాండ్‌లో గడిపారు.