సమంత ఎందుకలా చెప్పింది...?
గతంలో సిద్దార్థ్ తో చాన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది సమంత. తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు. సిద్ధూతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పిన చుల్ బులీ తర్వాత విడిపోయిన విషయాన్ని మాత్రం కన్ ఫర్మ్ చేయలేదు. కానీ మీడియా మాత్రం ఆ న్యూస్ కన్ ఫర్మ్ చేసేసింది. అయితే తాజాగా సమంత మరో వ్యక్తితో ప్రేమలో పడిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో సమంత ప్రేమాయణం సాగిస్తోందంటూ […]
Advertisement
గతంలో సిద్దార్థ్ తో చాన్నాళ్ల పాటు డేటింగ్ చేసింది సమంత. తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు. సిద్ధూతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పిన చుల్ బులీ తర్వాత విడిపోయిన విషయాన్ని మాత్రం కన్ ఫర్మ్ చేయలేదు. కానీ మీడియా మాత్రం ఆ న్యూస్ కన్ ఫర్మ్ చేసేసింది. అయితే తాజాగా సమంత మరో వ్యక్తితో ప్రేమలో పడిందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తతో సమంత ప్రేమాయణం సాగిస్తోందంటూ పుకార్లు వస్తున్నాయి. అతడ్ని తరచుగా కలుసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఎక్కువ తమిళ సినిమాలకు కాల్షీట్లు ఇస్తోందనే వాదనను కూడా తెరపైకి తెస్తోంది తమిళ మీడియా. ఈ వార్తలు సమంత వరకు వెళ్లాయి. దీంతో ఆమె వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సోలో లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని, తన మనసులో ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చింది సమంత. ఒకవేళ పెళ్లంటూ చేసుకునే పరిస్థితి వస్తే తన ట్విట్టర్ పేజీ ద్వారా మీడియాతో పాటు ప్రజలందరికీ ఒకేసారి చెబుతానని కూడా స్పష్టంచేసింది.
Advertisement