పీఏఏఎస్ నాయకుడి ఆత్మహత్య!
ఓబీసీలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నాయకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్‌కోట్‌లోని పునీత్ నగర్‌కు చెందిన ఉమేశ్ పటేల్ (34) పట్టణ కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం తన సొంత పరిశ్రమంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను మరణించేముందు రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు దక్కేందుకే తాను ప్రాణత్యాగం చేస్తున్నానని, తాను చనిపోయినా తన ప్రాణత్యాగం వృథా కాదని నమ్ముతున్నానంటూ లేఖలో పేర్కొన్నాడు. పటేల్ […]
Advertisement
ఓబీసీలో రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పీఏఏఎస్) నాయకుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్‌కోట్‌లోని పునీత్ నగర్‌కు చెందిన ఉమేశ్ పటేల్ (34) పట్టణ కన్వీనర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం తన సొంత పరిశ్రమంలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను మరణించేముందు రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్లు దక్కేందుకే తాను ప్రాణత్యాగం చేస్తున్నానని, తాను చనిపోయినా తన ప్రాణత్యాగం వృథా కాదని నమ్ముతున్నానంటూ లేఖలో పేర్కొన్నాడు. పటేల్ వర్గీయులకు, నా సోదరులకు క్షమాపణ కోరుతున్నా ఈ పోరాటంలో నేను లేకున్నా నా ఆత్మత్యాగం ఊరికే పోదని భావిస్తున్నానని లేఖలో తెలిపాడు. గతనెలలో ఆందోళన సందర్భంగా దారితీసిన హింసలో నలుగరు పటేల్ వర్గీయులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉద్యమనాయకుడు హర్దిక్ పటలే తాజాగా ఉమేశ్ మరణంతో ఏం నిర్ణయం తీసుకుంటారనని సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. మరోవైపు బీహార్లో ఎన్నికలకు సీఎం నితీశ్‌కుమార్‌కు పటేల్ సామాజిక వర్గం తరఫున హర్దిక్ తన మద్దతును ప్రకటించాడు.
Advertisement