దిబ్బ రొట్టె (For Children)

పెళ్లయిన కొన్నాళ్ళకు అల్లుడు పనిమీద పట్టణానికి వెళ్ళి దగ్గర్లోనే వున్న తన అత్తగారి గ్రామం గుండా వచ్చాడు. సరే అత్తాగారింటికి ఓ సారి వెళదామని నిర్ణయించుకున్నాడు. హఠాత్తుగా అల్లుని రాకతో యింటిల్లి పాదీ హడావుడి చేశారు అన్ని మర్యాదలు చూసి అల్లుడికి ఆనందం వేసింది. ఎక్కడకి ఏ పనిమీద వెళ్ళుతున్నారు మొదలయిన విషయాలు అరాతీశారు. మా అమ్మాయి ఎలావుంది? ఎం చెప్పింది మొదలయినవి వాకబు చేశారు అన్నిటికీ అల్లుడుగారు సౌమ్యంగా సమాధానాలు చెప్పారు. అంతా అయ్యాకా అల్లుడి […]

Advertisement
Update:2015-09-23 18:32 IST

పెళ్లయిన కొన్నాళ్ళకు అల్లుడు పనిమీద పట్టణానికి వెళ్ళి దగ్గర్లోనే వున్న తన అత్తగారి గ్రామం గుండా వచ్చాడు. సరే అత్తాగారింటికి ఓ సారి వెళదామని నిర్ణయించుకున్నాడు.

హఠాత్తుగా అల్లుని రాకతో యింటిల్లి పాదీ హడావుడి చేశారు అన్ని మర్యాదలు చూసి అల్లుడికి ఆనందం వేసింది. ఎక్కడకి ఏ పనిమీద వెళ్ళుతున్నారు మొదలయిన విషయాలు అరాతీశారు. మా అమ్మాయి ఎలావుంది? ఎం చెప్పింది మొదలయినవి వాకబు చేశారు అన్నిటికీ అల్లుడుగారు సౌమ్యంగా సమాధానాలు చెప్పారు.

అంతా అయ్యాకా అల్లుడి మర్యాదలు మొదలయ్యాయి రకరకాల వంటలతో భోజనం సిద్ధం చేశారు. భోజనానికి ముందు భోజనానికి చాలా సమయం వుండడం వల్ల అత్తగారు అల్లుడికి దిబ్బరొట్టె వేసి పెట్టింది అది వుబ్బెత్తుగా మెత్తగా మహారుచిగా అనిపించింది. పైగా ఆకలిగావున్నాడేమో ఆవురావుమని తిన్నాడు.

అత్తగారు ‘బావుందానాయనా!’ అంది.

అల్లుడు చాలా చాలా బావుందండీ అన్నాడు.

ఆమె’యింకొకటి వెయ్యమంటారా?’ అంది అల్లుడు మొహమాటంకొద్దీ వద్దన్నాడు. నిజానికి చాలా దిబ్బరొట్టెలు తినాలని వుంది కాని మొహమాటం.

అత్తగారు’మా అమ్మాయికూడా చాలా బాగా వేస్తుంది నాయనా అడిగి వేయించుకో అంది. అతను అప్పటిదాకా ఎప్పుడూ అట్లాంటివి తిని ఎరుగడు. వాటి పేరు కూడా విని ఎరగడు.

మొత్తానికి తన భార్యకు కూడా అవి తెలిసినందుకు ఆనందించాడు. అప్పటిదాకా ఆమె ఎందుకు అట్లాంటివి చేసిపెట్టలేకో అర్థం కాలేదు. సరే తెలిసింది కదా! యిప్పుడు అడిగి వేయించుకోవచ్చులే అనుకున్నాడు.

మరచిపోతానేమో అనుకుంటూ ‘దిబ్బరొట్టె, దిబ్బరొట్టె’ అంటూ చెప్పు కుంటూ యింటికి తిరుగుప్రయాణమయ్యాడు.

ఎదురుగా ఒక వాగువచ్చింది. అది జాగ్రత్తగా దాటలి. నీళ్ళలో అడుగు పెట్టాడు. చాలా చల్లగా వున్నాయి. దిబ్బరొట్టె ‘అన్నమాట మరచిపోయాడు. ఆ మాట స్థానంలో పప్పు బిళ్ళ’ అన్న మాట వచ్చింది. ఆ వెంటనే మాటి మాటికీ అనుకుంటూ యింటికి వెళ్ళాడు.

ఇంటికి వెళుతూనే ఆ మాటను గుర్తుంచుకుంటేనే జరిగిన విషయాలన్నీ భార్యతో చెప్పాడు. నాకు పప్పుబిళ్ళలు చేసిపెట్టు అన్నాడు.

ఆమె అవి ఎప్పుడూ చేసేవేకదా! అంది అతను యిప్పటి దాకా నువ్వు ఎప్పుడూ చేసిపెట్టలేదు. మీ అమ్మచేసి పెట్టింది. ఎంతరుచిగా వున్నాయో అన్నాడు.

మీరు వాటిని ఏమంటున్నారో, పప్పు బిళ్ళలు గట్టిగావుంటాయి. లేదు అవి పువ్వు లాగా మెత్తగా వుంటాయి అన్నాడు.

పప్పుబిళ్ళలు పువ్వులా మెత్తగా వుండడం ఎక్కడయినా చూశారా? అంది అతనికి కోసం వచ్చింది. నేను అడుగుతుంటే అడ్డ దిడ్డంగా మాట్లాడతావా? అంటు ఆమెని చెంపమీద కొట్టాడు

చెంపవాచింది. ఆమె ఏడుస్తూ’ ఎంత దెబ్బ కొట్టారు, దిబ్బరొట్టెలాగా వుబ్బింది అంది.

‘ఆ ఆ అవును నాకు కావలసింది అదే ‘ ఆ దిబ్బరొట్టెనే యిలా అన్నాను అంటూ ఆమెను క్షమాపణలు కోరాడు. ఆమె ఆమాత్రానికే కొట్టాలా అంటూ అతనికి దిబ్బరొట్టెలు వేసి పెట్టింది.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News