ఫేక్ ఎకౌంట్స్ పై సల్మాన్ పైర్

 బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫేస్ బుక్ ఫేక్ ఎకౌంట్స్ పై నిరసన వ్యక్తంచేశాడు. కొంతమంది ఆకతాయిలు తన పేరును ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాజాగా ఓ ఫేక్ ఫేస్ బుక్ ప్రొఫైల్ సల్మాన్ పేరిట ఓపెన్ అయింది. సల్మాన్ సొంత బ్యానర్ పై ఓ సినిమా నిర్మిస్తున్నామని, నటీనటులు కావాలని అందులో ఉంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్లు వాళ్ల ఫొటోలు పంపించాలని కూడా రాసుంది. పైగా ఆ ఎకౌంట్ నిండా అందమైన సల్మాన్ బొమ్మలు.. […]

Advertisement
Update:2015-09-24 00:31 IST
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫేస్ బుక్ ఫేక్ ఎకౌంట్స్ పై నిరసన వ్యక్తంచేశాడు. కొంతమంది ఆకతాయిలు తన పేరును ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశాడు. తాజాగా ఓ ఫేక్ ఫేస్ బుక్ ప్రొఫైల్ సల్మాన్ పేరిట ఓపెన్ అయింది. సల్మాన్ సొంత బ్యానర్ పై ఓ సినిమా నిర్మిస్తున్నామని, నటీనటులు కావాలని అందులో ఉంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్లు వాళ్ల ఫొటోలు పంపించాలని కూడా రాసుంది. పైగా ఆ ఎకౌంట్ నిండా అందమైన సల్మాన్ బొమ్మలు.. బీయింగ్ హ్యూమన్ బ్యానర్ లోగో అన్నీ ఉన్నాయి. ఇది నమ్మి కొందరు ఇప్పటికే ప్రొఫైల్స్ కూడా పంపించారు. విషయం సల్మాన్ వరకు వెళ్లింది. దీంతో కండల వీరుడు క్లారిటీ ఇచ్చాడు. తను ఎలాంటి సినిమా నిర్మించడం లేదని, నటీనటులు కావాలని యాడ్ ఇవ్వలేదని స్పష్టంచేశాడు. ఫేక్ ఫేస్ బుక్ ఎకౌంట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించాడు. ఏమైనా సందేహాలుంటే.. తన మేనేజర్ ను కలవొచ్చని కూడా సూచించాడు సల్మాన్.
Tags:    
Advertisement

Similar News