వీసీ తొలగింపు ఫైలు వెనక్కి పంపిన రాష్ట్రపతి

ప్రతిష్ఠాత్మక విశ్వభారతి సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతూ రాష్ట్రపతి సదరు ఫైలును ప్రభుత్వానికి తిప్పి పంపారు. అవసరమైతే న్యాయ సలహా తీసుకుని.. ఆ కాపీని ఫైలుకు జతచేర్చి తనకు పంపాలని ఆదేశించారు. విశ్వభారతి సెంట్రల్‌ వర్సిటీ వీసీ సుశాంత దాస్‌గుప్త ఆర్థిక అవకతలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావటంతో రిటైర్డు జడ్జితో త్రిసభ్య కమిటీని హెచ్‌ఆర్‌డీ ఏర్పాటు చేసింది. అవకతవకలు నిజమేనని కమిటీ తేల్చగా దీనిపై సుశాంత వివరణ కోరింది. […]

Advertisement
Update:2015-09-24 04:10 IST
ప్రతిష్ఠాత్మక విశ్వభారతి సెంట్రల్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని కోరుతూ రాష్ట్రపతి సదరు ఫైలును ప్రభుత్వానికి తిప్పి పంపారు. అవసరమైతే న్యాయ సలహా తీసుకుని.. ఆ కాపీని ఫైలుకు జతచేర్చి తనకు పంపాలని ఆదేశించారు. విశ్వభారతి సెంట్రల్‌ వర్సిటీ వీసీ సుశాంత దాస్‌గుప్త ఆర్థిక అవకతలకు పాల్పడ్డారనే ఆరోపణలు రావటంతో రిటైర్డు జడ్జితో త్రిసభ్య కమిటీని హెచ్‌ఆర్‌డీ ఏర్పాటు చేసింది. అవకతవకలు నిజమేనని కమిటీ తేల్చగా దీనిపై సుశాంత వివరణ కోరింది. అయితే ఆయన ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని మానవ వనరుల శాఖ ఆయనను తొలగించాలని రాష్ట్రపతిని కోరింది. పశ్చిమబెంగాల్‌ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్‌ నేత ఎస్‌ఎస్‌ యాదవ్‌ కూడా సుశాంత వర్సిటీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన వల్ల విశ్వవిద్యాలయానికి చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు. అతన్ని వెంటనే తొలగించాలని కూడా ఆయన డిమాండు చేశారు.
Tags:    
Advertisement

Similar News