వచ్చేనెల 10 వరకు అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర శాసనసభను వచ్చేనెల 10వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, విపక్షనేత జానారెడ్డితో సహా వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం, మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతికి ఉభయసభలు నివాళి అర్పించిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29కి వాయిదా […]
Advertisement
తెలంగాణ రాష్ట్ర శాసనసభను వచ్చేనెల 10వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహాసంఘ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, విపక్షనేత జానారెడ్డితో సహా వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు ప్రారంభమైన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం, మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మృతికి ఉభయసభలు నివాళి అర్పించిన అనంతరం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29కి వాయిదా పడ్డాయి. బీఏసీలో నిర్ణయించిన ప్రకారం అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి వచ్చేనెల 10 వరకు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలను నిర్వహంచాలని నిర్ణయించారు. 29, 30వ తేదీల్లో రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సమస్యలపై చర్చించాలని నిర్ణయించారు. ఆ రెండు రోజుల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాలను నిర్వహించరాదని నిర్ణయించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌లు పెండింగ్‌లో చాలాకాలం నుంచి ఉన్నాయని వాటిపై సభలో చర్చించాలన్న టీ-టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు వాదనను బీఏసీ తోసిపుచ్చింది. ప్రశ్నోత్తరాల అనంతరమే మిగిలిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టనున్నారు. అక్టోబర్ 2, 3, 4న అసెంబ్లీకి సెలవులుంటాయని బీఏసీ పేర్కొంది.
Advertisement