అండమాన్‌ 'స్థానికం' బీజేపీ కైవసం

అండమాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయదుందుబి మోగించింది. అండమాన్‌ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌లోని 24 వార్డులకు జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ ఆరు సీట్లలో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. మరో స్థానంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తమిళనాడుకు చెందిన సెల్వీ, బెంగాల్‌కు చెందిన ప్రతిమాబేగం […]

Advertisement
Update:2015-09-23 06:01 IST
అండమాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయదుందుబి మోగించింది. అండమాన్‌ రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌లోని 24 వార్డులకు జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ ఆరు సీట్లలో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రెండు స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. నాలుగు వార్డుల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. మరో స్థానంలో టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తమిళనాడుకు చెందిన సెల్వీ, బెంగాల్‌కు చెందిన ప్రతిమాబేగం బెనర్జీ టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. ఇక డీఎంకే-1, ఏఐడీఎంకే-1, ఇతరులు- 4 వార్డుల్లో విజయం సాధించాయి. కాగా, అండమాన్‌ ఫలితాల ఉత్సాహంతో పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసాల్లో జరిగే ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని టీడీపీ యోచిస్తోంది.
Tags:    
Advertisement

Similar News