రిజర్వేషన్ల సమీక్షకో కమిటీ: ఆరెస్సెస్ సూచన
దేశంలో రిజర్వేషన్‌ల అమలు, సంబంధిత అంశాల పరిశీలనకు ఒక కమిటీ వేయాలని, ఇందులో చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులకు చోటు కల్పించాలని, రాజకీయ నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ సూచించారు. రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి? మొదలైన అంశాలను అధ్యయనం చేయవలసిన సమయం వచ్చిందని భగవత్ వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ పత్రిక పాంచజన్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు.. ఆకాంక్షలు ఉంటాయని అయితే […]
Advertisement
దేశంలో రిజర్వేషన్‌ల అమలు, సంబంధిత అంశాల పరిశీలనకు ఒక కమిటీ వేయాలని, ఇందులో చిత్తశుద్ధి కలిగిన వ్యక్తులకు చోటు కల్పించాలని, రాజకీయ నాయకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ సూచించారు. రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి? ఎంతకాలం ఇవ్వాలి? మొదలైన అంశాలను అధ్యయనం చేయవలసిన సమయం వచ్చిందని భగవత్ వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్ పత్రిక పాంచజన్యకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో ఆశలు.. ఆకాంక్షలు ఉంటాయని అయితే ఒత్తిళ్లకు తలొగ్గి, అధికశాతం ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి కొందరి ఆశలు నెరవేర్చాలనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లో పటేళ్ల సామాజికవర్గం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ పెద్త ఎత్తున ఆందోళన చేస్తున్న నేపధ్యంలో భగవత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మన రాజ్యాంగ నిర్మాతలు సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ల విధానాన్ని తీసుకొచ్చారని, ఈ స్ఫూర్తిని దెబ్బతీయకుండా, రాజకీయ ఒత్తిళ్ల ప్రభుత్వం తలొగ్గకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. భూసేకరణ బిల్లుపై కేంద్రం వెనకడుగు వేయడం, ఓబీసీ రిజర్వేషన్ కోసం పటేళ్ల ఆందోళన నేపథ్యంలో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Advertisement