జర నవ్వండి ప్లీజ్ 210
సరళ: అమ్మా! మనం వొచ్చిన ట్రెయిన్ పదినిముషాలయింది కదా! ఉంటుందా! వెళ్ళిపోయుంటుందా? సూట్‌కేసులు సర్దుతున్న తల్లి చిరాకుగా ‘నేను చేస్తున్న పనేమిటి? ఎందుకు విసిగిస్తావు?’ అంది తల్లి. ‘ఏం లేదు. చెల్లి ట్రెయిన్ దిగినట్లు లేదు అందుకని’ తాపీగా అంది సరళ. ———————————————————————————– డాక్టర్: బాబూ! అయామ్ సారీ! నీకు రాబీస్ వచ్చింది. ఒక గంటలో నీకు పిచ్చెక్కే అవకాశముంది. పేషెంట్: డాక్టర్‌గారూ! కాస్త పెన్ను, పేపరు ఇవ్వండి. డాక్టర్: ఎందుకు? వీలునామా రాయాలనుకుంటున్నావా? పేషెంట్: లేదు […]
సరళ: అమ్మా! మనం వొచ్చిన ట్రెయిన్ పదినిముషాలయింది కదా! ఉంటుందా! వెళ్ళిపోయుంటుందా?
సూట్‌కేసులు సర్దుతున్న తల్లి చిరాకుగా ‘నేను చేస్తున్న పనేమిటి? ఎందుకు విసిగిస్తావు?’ అంది తల్లి.
‘ఏం లేదు. చెల్లి ట్రెయిన్ దిగినట్లు లేదు అందుకని’ తాపీగా అంది సరళ.
———————————————————————————–
డాక్టర్: బాబూ! అయామ్ సారీ! నీకు రాబీస్ వచ్చింది. ఒక గంటలో నీకు పిచ్చెక్కే అవకాశముంది.
పేషెంట్: డాక్టర్‌గారూ! కాస్త పెన్ను, పేపరు ఇవ్వండి.
డాక్టర్: ఎందుకు? వీలునామా రాయాలనుకుంటున్నావా?
పేషెంట్: లేదు డాక్టర్! ఎవరెవర్ని కరవాలో లిస్టు తయారుచేద్దామని.
———————————————————————————–
జడ్జి: నువ్వక్కడ ఎందుకు కారు పార్కు చేశావు?
ముద్దాయి: అక్కడ ‘ఫైన్ ఫర్ పార్కింగ్’ అని ఉందండి.