యేడాదిన్నరలో రూ. 63 వేల కోట్ల అప్పులు
కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయమిది: కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతూనే ఏడాదిన్నర పాలనలో.. 63 వేల కోట్లు అప్పులు చేసి.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దివాలా రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేసీఆర్ బృందం పది రోజుల టూరుపై.. శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స్పెషల్ చార్టర్ విమానంలో వెళ్ళిన ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు సాధించారో చెప్పాలన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో సింగపూర్ వెళ్ళిన […]
Advertisement
కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయమిది: కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ
తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతూనే ఏడాదిన్నర పాలనలో.. 63 వేల కోట్లు అప్పులు చేసి.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దివాలా రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కేసీఆర్ బృందం పది రోజుల టూరుపై.. శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. స్పెషల్ చార్టర్ విమానంలో వెళ్ళిన ముఖ్యమంత్రి.. రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు సాధించారో చెప్పాలన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో సింగపూర్ వెళ్ళిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఎంత మొత్తంలో పెట్టుబడులు తెచ్చారో… ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనుభవం లేని వాళ్ళను వెంట పెట్టుకొని కేసీఆర్ చైనా పర్యటనకు వెళ్ళడం విహార యాత్రను తలపిస్తోందని ఆయన ఆరోపించారు పది రోజుల చైనా పర్యటనకు ఎంత ఖర్చైంది, పరిశ్రమలు పెట్టేందుకు ఎంతమంది ముందుకు వచ్చారు? ఎన్ని ఒప్పందాలు చేసుకున్నారు, రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో.. తెలుపుతూ శ్వేతపత్రం విడుడల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చైనా టూర్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని విమర్శించారు. ఆర్నెళ్ల క్రితం సింగపూర్ వెళ్లి వచ్చిన కేసీఆర్.. ఇప్పటి వరకు ఎన్ని ఇండస్ట్రీ లు ఏర్పాటు చేశారని నిలదీశారు.
Advertisement