నేతాజీ ఫైళ్ళు ఎందుకు బయట పెట్టారు?

వచ్చే యేడాదిలో జరిగే ఎన్నికల్లో లబ్ది పొందడానికే భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ జీవితానికి చెందిన 64 ఫైళ్ళను పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం బయటపెట్టి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వం హడావిడిగా ఈ ఫైళ్ళను బహిర్గతం చేయడం  వెనుక అంతకుమించిన మర్మం ఏదీ లేదని వీరు చెబుతున్నారు. మమతా బెనర్జీ బహిర్గత పరిచిన 64 ఫైళ్లలో అతి కీలక సమాచారం ఏదీ లేదని… ఇవన్నీ చదివిన తర్వాత మాత్రమే బయటపెట్టారని, నేతాజీ మరణానికి సంబందించిన […]

Advertisement
Update:2015-09-18 17:44 IST
వచ్చే యేడాదిలో జరిగే ఎన్నికల్లో లబ్ది పొందడానికే భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ జీవితానికి చెందిన 64 ఫైళ్ళను పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం బయటపెట్టి ఉంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వం హడావిడిగా ఈ ఫైళ్ళను బహిర్గతం చేయడం వెనుక అంతకుమించిన మర్మం ఏదీ లేదని వీరు చెబుతున్నారు. మమతా బెనర్జీ బహిర్గత పరిచిన 64 ఫైళ్లలో అతి కీలక సమాచారం ఏదీ లేదని… ఇవన్నీ చదివిన తర్వాత మాత్రమే బయటపెట్టారని, నేతాజీ మరణానికి సంబందించిన అత్యంత రహస్య పత్రాలన్నీ కేంద్రం వద్దే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్‌లో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మమత ప్రభుత్వం హడావిడిగా ఈ ఫైళ్లను వెల్లడించిందని వారంటున్నారు. ఈ ఫైళ్ల వ్యవహారంలో బోస్‌ కుటుంబీకులను మమతా బెనర్జీ అస్సలు సంప్రదించనే లేదని వారు అంటున్నారు.
Tags:    
Advertisement

Similar News