ఆ స్టాంప్‌లు ఇక స్టాప్!
తల్లీకొడుకుల బొమ్మపై కమలనాథుల కన్నెర్ర … మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీల చిత్రాలతో వస్తున్న స్టాంపుల ముద్రణను నిలిపేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టిన మాజీ ప్రధానులను జనం స్మృతిపథంలో చెరిపేసే కుట్రలో భాగమే ఇదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. దేశాభివృద్ధికి పాటుపడి, తమ ప్రాణాలనే కోల్పోయిన మాజీ ప్రధానుల కుటుంబంపై […]
Advertisement
తల్లీకొడుకుల బొమ్మపై కమలనాథుల కన్నెర్ర …
మాజీ ప్రధానులు ఇందిరా, రాజీవ్ గాంధీల చిత్రాలతో వస్తున్న స్టాంపుల ముద్రణను నిలిపేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశం కోసం, దేశ ప్రజల కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టిన మాజీ ప్రధానులను జనం స్మృతిపథంలో చెరిపేసే కుట్రలో భాగమే ఇదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఆరోపించారు. దేశాభివృద్ధికి పాటుపడి, తమ ప్రాణాలనే కోల్పోయిన మాజీ ప్రధానుల కుటుంబంపై కక్షతోనే ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని సుర్జేవాలా మండిపడ్డారు. ఇదివరకూ ఇందిర, రాజీవ్ పేరుతో ఉన్న కొన్ని అవార్డుల పేర్లు కూడా మార్చేశారని, ఇది సమంజసంకాదన్నారు. ఇందిర, రాజీవ్‌ను కాంగ్రెస్ పార్టీ నాయకులుగా బీజేపీ చూస్తోందని, 21వ శతాబ్దంలో భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలిపిన వ్యక్తులుగా వీరిని గుర్తించాలని సుర్జేవాలా సూచించారు.
Advertisement