టాప్-200లో రెండు భారత వర్సిటీలు
ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా రెండు భారత విశ్వవిద్యాలయాలు టాప్ 200లో చోటు సంపాదించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు 147వ ర్యాంకును సాధించగా.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ 179వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ర్యాంకింగ్స్‌లో అదే ఐఐటీ-ఢిల్లీ 235వ స్థానంలో ఉంది. ఇక, టాప్ 400లో దాదాపు 7 భారత యూనివర్సిటీలకు చోటు దక్కింది. ఢిల్లీ, ముంబై యూనివర్సిటీలు మాత్రం ఆ దరిదాపుల్లో లేవు. క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2015లో […]
Advertisement
ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా రెండు భారత విశ్వవిద్యాలయాలు టాప్ 200లో చోటు సంపాదించాయి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు 147వ ర్యాంకును సాధించగా.. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఢిల్లీ 179వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ర్యాంకింగ్స్‌లో అదే ఐఐటీ-ఢిల్లీ 235వ స్థానంలో ఉంది. ఇక, టాప్ 400లో దాదాపు 7 భారత యూనివర్సిటీలకు చోటు దక్కింది. ఢిల్లీ, ముంబై యూనివర్సిటీలు మాత్రం ఆ దరిదాపుల్లో లేవు. క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2015లో ఈ యూనివర్శిటీలు ఇలాంటి ఘనత లభించింది. టాప్-50లో నాలుగు లండన్ యూనివర్సిటీలు, బోస్టన్, న్యూయార్క్‌కు చెందిన 3, సిడ్నీ, హాంగ్‌కాంగ్, బీజింగ్‌కు చెందిన 2 చొప్పున యూనివర్సిటీలు స్థానం సంపాదించాయి. కాగా, టాప్-200లో చోటు దక్కించుకున్న ఐఐఎస్‌సీ-బెంగళూరు, ఐఐటీ-ఢిల్లీ యూనివర్సిటీలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. ఈ ర్యాంకింగ్స్ విద్యా లోకానికి మరింత నైతిక స్థైర్యాన్ని ఇస్తాయని ఆయన కొనియాడారు. అంతేగాకుండా విద్యార్థి లోకానికి ప్లేస్‌మెంట్, వృద్ధినీ చేకూర్చేందుకు బాటలు వేస్తుందన్నారు.
Advertisement