ఇంద్రాణిని జైల్లో కలిసిన బ్రిటన్ బృందం

కూతురు హత్య కేసులో పోలీసు కస్టడీలో ఉన్న ఇంద్రాణి ముఖర్జీకి సాయమేమన్నా కావాలా అని అడిగేందుకు బ్రిటిష్‌ బృందం సభ్యులు ఆమెను కలిశారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఆమెకు బ్రిటిష్‌ పౌరసత్వం ఉందట. దాంతో తమ పౌరురాలికి జైలులో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సహాయం ఏమైనా అవసరమా అని అడిగి తెలుసుకునేందుకే వారు జైలుకు వచ్చారని తెలిసింది. అయితే జైల్లో ఉన్న ఆమెను కలిసేందుకు ముంబయిలోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ బృందానికి […]

Advertisement
Update:2015-09-15 11:33 IST
కూతురు హత్య కేసులో పోలీసు కస్టడీలో ఉన్న ఇంద్రాణి ముఖర్జీకి సాయమేమన్నా కావాలా అని అడిగేందుకు బ్రిటిష్‌ బృందం సభ్యులు ఆమెను కలిశారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఎందుకంటే ఆమెకు బ్రిటిష్‌ పౌరసత్వం ఉందట. దాంతో తమ పౌరురాలికి జైలులో సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సహాయం ఏమైనా అవసరమా అని అడిగి తెలుసుకునేందుకే వారు జైలుకు వచ్చారని తెలిసింది. అయితే జైల్లో ఉన్న ఆమెను కలిసేందుకు ముంబయిలోని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషన్ బృందానికి జైలు అధికారులు మొదట అనుమతి ఇవ్వలేదు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి తగిన అనుమతి కావాలని వారు తెలిపారు. దీంతో ఢిల్లీలోని బ్రిటీష్ హై కమిషన్ అధికారులను ముంబయి డిప్యూటీ హైకమిషన్‌ బృందం సంప్రదించిన తర్వాత మాత్రమే జైల్లో ఉన్న ఇంద్రాణిని కలిసేందుకు వారికి అనుమతి లభించింది.
Tags:    
Advertisement

Similar News