సీమ నాయకుడు బైరెడ్డికి గృహ నిర్బంధం
పరిశ్రమల పేరుతో విలువైన భూములను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. వాస్తవానికి బైరెడ్డి సోమవారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం పూడిచర్ల నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయాల్సి ఉంది. దీన్ని అడ్డుకునే యత్నంలో భాగంగా పోలీసులు ఆయన్ని ఇంటి నుంచి బయటికి రాకుండా చేసి గృహంలోనే నిర్బంధించారు. దీంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇంట్లోనే దీక్షకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటల […]
Advertisement
పరిశ్రమల పేరుతో విలువైన భూములను స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు గృహ నిర్భంధం చేశారు. వాస్తవానికి బైరెడ్డి సోమవారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం పూడిచర్ల నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేయాల్సి ఉంది. దీన్ని అడ్డుకునే యత్నంలో భాగంగా పోలీసులు ఆయన్ని ఇంటి నుంచి బయటికి రాకుండా చేసి గృహంలోనే నిర్బంధించారు. దీంతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఇంట్లోనే దీక్షకు ఉపక్రమించారు. సాయంత్రం 5 గంటల వరకు తాను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని శపథం చేశారు. మరోవైపు బైరెడ్డి అనుచరుల్ని కూడా ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఫలితంగా బైరెడ్డి ఇంటి వద్ద తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిశ్రమలకు భూములు తీసుకునే పేరుతో రైతుల పొట్ట కొడుతున్న ప్రభుత్వాన్ని అన్ని ప్రాంతాల్లోను నిలదీస్తామని, అన్నదాతలకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉల్లంఘిస్తామని బైరెడ్డి హెచ్చరించారు.
Advertisement