మాజీ సీఎం కుమారుడి అరెస్టు!
బీహార్ మాజీ సీఎం కుమారుడు ప్రవీణ్ కుమార్ భారీగా నగదుతో పోలీసులకు పట్టుబడ్డాడు. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ మాజీ సీఎం కుమారుడు దాదాపు రూ.4.65 లక్షల డబ్బుతో పట్టుబడటం సంచనలం రేపింది. ఎన్నికల నేపథ్యంలో బీహార్ పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం గయా-జహానాబాద్ చెక్‌పోస్టు వద్ద ప్రవీణ్‌కుమార్ ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీలు చేసిన పోలీసులకు ఈ నగదు దొరికింది. డబ్బు ఎక్కడిదన్న ప్రశ్నకు ప్రవీణ్ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో […]
Advertisement
బీహార్ మాజీ సీఎం కుమారుడు ప్రవీణ్ కుమార్ భారీగా నగదుతో పోలీసులకు పట్టుబడ్డాడు. వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ మాజీ సీఎం కుమారుడు దాదాపు రూ.4.65 లక్షల డబ్బుతో పట్టుబడటం సంచనలం రేపింది. ఎన్నికల నేపథ్యంలో బీహార్ పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం గయా-జహానాబాద్ చెక్‌పోస్టు వద్ద ప్రవీణ్‌కుమార్ ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీలు చేసిన పోలీసులకు ఈ నగదు దొరికింది. డబ్బు ఎక్కడిదన్న ప్రశ్నకు ప్రవీణ్ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అతన్ని ముగ్దుంపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి ప్రశ్నించారు. ‘పట్నా హనుమాన్‌నగర్‌లోని మా కొత్త ఇంటి నిర్మాణానికి ఈ డబ్బును తీసుకెళ్తున్నాను’ అని విచారణలో ప్రవీణ్‌కుమార్ వెల్లడించినా పోలీసులు మాత్రం విశ్వసించడం లేదు. డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది…? ఎక్కడకు వెళుతోంది..? అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. జితన్ రాం మంఝీ జెహ్నాబాద్ జిల్లాలోని మక్దుంపుర్(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించారు. జెడీ(యూ) పార్టీ తరఫున శాసన సభకు 6 సార్లు ఎన్నికయ్యారు. మాంజీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం జేడీ(యూ) నుంచి బయటకు వచ్చి హిందుస్థానీ అవమ్ మోర్చా పార్టీ(హెచ్ఎమ్)ని స్థాపించిన సంగతి తెలిసిందే.
Advertisement