ప్రాణాలు తీసిన వీడియోగేమ్!
అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. ఏదైనా శ్రుతి మించితే.. మొదటికే మోసం వస్తుంది. రష్యాలో ఓ టీనేజర్ 22 గంటలపాటు ఏకధాటిగా వీడియోగేమ్ ఆడి ఆడి.. చివరకు ప్రాణాలొదిలాడు. రష్యాలోని బాష్కోరోస్తాన్ రిపబ్లిక్లోని ఉల్చాయ్‌లో 17 ఏళ్ల రుస్తాంకు ఆగస్టు 8న కాలువిరిగింది. దీంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఖాళీగా ఇంట్లో కూర్చోవడంతో ఏమీ తోచక కాలక్షేపానికి వీడియోగేమ్‌లు ఆడటం మొదలుపెట్టడం. సాధారణ రోజుల్లో విపరీతంగా వీడియోగేములు ఆడే రుస్తుం.. కాలు విరిగి ఇంట్లోనే కూర్చోవడంతో అదే […]
Advertisement
అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. ఏదైనా శ్రుతి మించితే.. మొదటికే మోసం వస్తుంది. రష్యాలో ఓ టీనేజర్ 22 గంటలపాటు ఏకధాటిగా వీడియోగేమ్ ఆడి ఆడి.. చివరకు ప్రాణాలొదిలాడు. రష్యాలోని బాష్కోరోస్తాన్ రిపబ్లిక్లోని ఉల్చాయ్‌లో 17 ఏళ్ల రుస్తాంకు ఆగస్టు 8న కాలువిరిగింది. దీంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఖాళీగా ఇంట్లో కూర్చోవడంతో ఏమీ తోచక కాలక్షేపానికి వీడియోగేమ్‌లు ఆడటం మొదలుపెట్టడం. సాధారణ రోజుల్లో విపరీతంగా వీడియోగేములు ఆడే రుస్తుం.. కాలు విరిగి ఇంట్లోనే కూర్చోవడంతో అదే పనిగా పెట్టుకున్నాడు. గత నెల 30న అతని గదిలో నుంచి ఎలాంటి శబ్ధాలు రాకపోయేసరికి తల్లిదండ్రులు వెళ్లి చూడగా గదిలో రుస్తుం అచేతనా వస్థలో పడి ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అతను మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. 24 గంటలపాటు కదలకుండా కూర్చోవడంతో శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయి.. మరణానికి దారి తీసి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. అతను ఏడాదిన్నరలో 2 వేల గంటలపాటు వీడియోగేమ్ ఆడినట్లు దర్యాప్తులో తేలింది. రుస్తుం మరణం తల్లిదండ్రులకు హెచ్చరిక అని రష్యా అధికారులు హెచ్చరిస్తున్నారు. పిల్లలను వారి మానాన వారిని వదిలేయకుండా ఓ కంట కనిపెట్టాలని సూచించారు.
Advertisement