జర నవ్వండి ప్లీజ్ 198

డాక్టర్‌ మసాజ్‌ ఒక ముసలతను డాక్టర్‌ దగ్గరికొచ్చాడు. డాక్టర్‌ అతన్ని పడుకోబెట్టి చేతులు పట్టి, కాళ్లు పట్టి, ఒళ్లు మసాజ్‌ చేసి అరగంట గడిచాక “ఎలా ఉంది?” అని అడిగాడు. ముసలతను “చాలా బాగుంది డాక్టర్‌! కాని నేను పంటి నొప్పితో వచ్చాను” అన్నాడు. ———————————————————————————————- నిద్రమాత్ర గాఢనిద్రపోతున్న పేషెంట్‌ని చాలా ప్రయత్నించి నిద్రలేపింది నర్స్‌. పేషెంట్‌ విసుగ్గా “మంచి నిద్ర పాడుచేశారు కదా సిస్టర్‌. ఇంతకూ ఎందుకు లేపారు?” “మీరు నిద్ర మాత్ర వేసుకోవడం మర్చిపోయి […]

Advertisement
Update:2015-09-06 18:33 IST

డాక్టర్‌ మసాజ్‌
ఒక ముసలతను డాక్టర్‌ దగ్గరికొచ్చాడు. డాక్టర్‌ అతన్ని పడుకోబెట్టి చేతులు పట్టి, కాళ్లు పట్టి, ఒళ్లు మసాజ్‌ చేసి అరగంట గడిచాక “ఎలా ఉంది?” అని అడిగాడు.
ముసలతను “చాలా బాగుంది డాక్టర్‌! కాని నేను పంటి నొప్పితో వచ్చాను” అన్నాడు.
———————————————————————————————-
నిద్రమాత్ర
గాఢనిద్రపోతున్న పేషెంట్‌ని చాలా ప్రయత్నించి నిద్రలేపింది నర్స్‌.
పేషెంట్‌ విసుగ్గా “మంచి నిద్ర పాడుచేశారు కదా సిస్టర్‌. ఇంతకూ ఎందుకు లేపారు?”
“మీరు నిద్ర మాత్ర వేసుకోవడం మర్చిపోయి పడుకున్నారు” అంది.
———————————————————————————————-
వేధింపులు
“ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తూ ఇంతకాలం నిన్ను వేధించిన ఆ రాజును ఎందుకు పెళ్ళి చేసుకుంటానన్నావో అస్సలు అర్థం కావడం లేదే నాకు.”
“వాడు పెట్టిన హింసకి ప్రతీకారం తీర్చుకోవడానికి. పెళ్ళయ్యాక ఇంతకు ఇంత అనుభవిస్తాడు వాడు. వాడిని ముప్పు తిప్పలు పెట్టి క్షణం క్షణం భయపడుతూ బతికేలా చేయాలంటే ఇదొకటే మార్గం!!!”

Tags:    
Advertisement

Similar News