జర నవ్వండి ప్లీజ్ 197

నరకం భార్యా భర్తలు పోట్లాడుకున్నారు. భార్య కోపంతో సూట్‌కేసులో చీరలు సర్దుకుంది. ఇల్లు దాటి వెళుతుంటే భర్త “ఎక్కడికి వెళుతున్నావు” అన్నాడు. భార్య మరింత కోపంతో “ఎక్కడికి పోతే మీకెందుకు? నరకానికి వెళుతున్నా” అంది. “సరే మీ అమ్మానాన్నలను, బంధువులను అడిగానని చెప్పు” అన్నాడు భర్త. ———————————————————————————————- సెల్యూట్‌… సైనికుల్లో గూర్ఖా రెజిమెంట్‌ వారికి క్రమశిక్షణ ఎక్కువ. ఎప్పుడూ నిబంధనలు పాటిస్తుంటారు. ఓ రోజు అనుకోకుండా వాళ్లున్న భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే అందరూ ఓ తాడు […]

Advertisement
Update:2015-09-05 18:33 IST

నరకం
భార్యా భర్తలు పోట్లాడుకున్నారు. భార్య కోపంతో సూట్‌కేసులో చీరలు సర్దుకుంది. ఇల్లు దాటి వెళుతుంటే భర్త “ఎక్కడికి వెళుతున్నావు” అన్నాడు.
భార్య మరింత కోపంతో “ఎక్కడికి పోతే మీకెందుకు? నరకానికి వెళుతున్నా” అంది.
“సరే మీ అమ్మానాన్నలను, బంధువులను అడిగానని చెప్పు” అన్నాడు భర్త.
———————————————————————————————-
సెల్యూట్‌…
సైనికుల్లో గూర్ఖా రెజిమెంట్‌ వారికి క్రమశిక్షణ ఎక్కువ. ఎప్పుడూ నిబంధనలు పాటిస్తుంటారు.
ఓ రోజు అనుకోకుండా వాళ్లున్న భవనంలో మంటలు చెలరేగాయి. వెంటనే అందరూ ఓ తాడు పట్టుకుని కిందకు దూకేశారు. వాళ్ల ఆఫీసర్‌ చివర్న కిందికి దూకాడు. ఆయన కోసం వల పట్టుకున్న సైనికులు చివరి నిమిషంలో దాన్ని వదిలేసి ఆయనకు సెల్యూట్‌ చేశారు. ఎందుకంటే ఆయన వాళ్ల పై ఆఫీసర్‌.
———————————————————————————————-
మోడరన్‌ ఆర్ట్‌
మోడ్రన్‌ ఆర్ట్‌ గ్యాలరీని పరిశీలిస్తోంది ఓ లేడీ. ఓ దగ్గరకొచ్చింది. అక్కడున్న బొమ్మను చూస్తూ “ఛీ… ఇంత అసహ్యంగా ఉంది. ఇది మోడ్రన్‌ ఆర్టా?” అని అక్కడున్న అతన్ని అడిగింది.
“కాదు మేడం… అది అద్దం” అన్నాడు అతడు.

Tags:    
Advertisement

Similar News