‘అమ్మ’ ఉప్పు దేశమంతటా..
‘అమ్మ’ పథకాలతో తమిళనాడును అదరగొడుతున్న పురచ్చితలైవి జయలలిత.. ఇప్పుడు తన మార్కును ఇతర రాష్ట్రాలపైనా వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. దేశ ప్రజలకు ‘అమ్మ ఉప్పు’ను రుచి చూపించబోతున్నారు. అమ్మ ఉప్పుకు తమిళనాడు ప్రజలు జేజేలు పలుకుతుండటంతో దానిని ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్కెట్ చేయాలని తమిళనాడు సాల్ట్ ఆర్గనైజేషన్ యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అమ్మ ఉప్పును మార్కెట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తమిళనాడులో అమ్మ ఉప్పుతో పాటు అమ్మ […]
Advertisement
‘అమ్మ’ పథకాలతో తమిళనాడును అదరగొడుతున్న పురచ్చితలైవి జయలలిత.. ఇప్పుడు తన మార్కును ఇతర రాష్ట్రాలపైనా వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. దేశ ప్రజలకు ‘అమ్మ ఉప్పు’ను రుచి చూపించబోతున్నారు. అమ్మ ఉప్పుకు తమిళనాడు ప్రజలు జేజేలు పలుకుతుండటంతో దానిని ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్కెట్ చేయాలని తమిళనాడు సాల్ట్ ఆర్గనైజేషన్ యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో అమ్మ ఉప్పును మార్కెట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే తమిళనాడులో అమ్మ ఉప్పుతో పాటు అమ్మ హోటల్స్, అమ్మ సిమెంట్, అమ్మ మంచినీరు వంటి అనేక ‘అమ్మ’ పథకాలు అమలులో ఉన్నాయి.
Advertisement