ఢిల్లీ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్గావ్ కాల్ సెంటర్ జిఎంఆర్‌కు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబులు పెట్టామని చెబుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఎయిర్ పోర్టు అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేటి తెల్లవారుజామున బయలుదేరిన మూడు విమానాలను అధికారులు […]
Advertisement
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్గావ్ కాల్ సెంటర్ జిఎంఆర్‌కు ఈ బెదిరింపు కాల్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబులు పెట్టామని చెబుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఎయిర్ పోర్టు అధికారులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేటి తెల్లవారుజామున బయలుదేరిన మూడు విమానాలను అధికారులు వెనక్కు పిలిపించారు. తమకు వచ్చిన ఫోన్ కాల్ పై విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు.
Advertisement