భావిభారత పౌరులకు ప్రథమపౌరుడి పాఠాలు
భారతదేశ ప్రథమపౌరుడు..మొట్టమొదటిసారిగా గురువు అవతారం ఎత్తారు. భావిభారత పౌరులకు భారతదేశ రాజకీయ చరిత్రపై పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వినూత్నమైన ఈ కార్యక్రమాన్ని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేపట్టారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆదాయ వనరులు, నిధుల వినియోగం, అభివృద్ధి వంటి అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ప్రణబ్ మాస్టారు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరించడంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలు చాలా కీలకమైనవని విద్యార్థులకు వివరించారు. నేను ఓ గ్రామం […]
Advertisement
భారతదేశ ప్రథమపౌరుడు..మొట్టమొదటిసా రిగా గురువు అవతారం ఎత్తారు. భావిభారత పౌరులకు భారతదేశ రాజకీయ చరిత్రపై పాఠాలు చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వినూత్నమైన ఈ కార్యక్రమాన్ని రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ చేపట్టారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆదాయ వనరులు, నిధుల వినియోగం, అభివృద్ధి వంటి అంశాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ప్రణబ్ మాస్టారు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరించడంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేపట్టిన సంస్కరణలు చాలా కీలకమైనవని విద్యార్థులకు వివరించారు. నేను ఓ గ్రామం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగాను. అందరికీ సమానావకాశాలు కల్పించడంలో ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యమని ప్రణబ్ చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆలోచన మేరకు ప్రథమపౌరుడు ఈ క్లాసు తీసుకున్నారు.
Advertisement