జర నవ్వండి ప్లీజ్ 195
సమ్మర్ క్యాంప్ సతీష్: మా చిన్నవాణ్ణి సమ్మర్ క్యాంప్‌కి పంపుతున్నాం. స్నేహితుడు: సెలవుల్లో హాయిగా గడుపుతాడు. సతీష్: వాడు కాదు మేం! ————————————————————————- గొప్పలు తన తండ్రి గురించి కొడుకు ఇలా చెబుతున్నాడు. “మా నాన్న పులి, నరసింహ, ఠాగూర్” అన్నాడు. పక్కనే ఉన్న అతడి ఫ్రెండ్ ఇలా అన్నాడు. “అవునా మీ నాన్నను చూడాలంటే టిక్కెట్టెంత?” అన్నాడు. ————————————————————————- ఆస్పత్రి బిల్ “డాక్టర్! ప్రతిరోజూ నాకో భయంకరమైన కల వస్తోంది. ఒక దయ్యం నన్ను తరుముతోంది. […]
సమ్మర్ క్యాంప్
సతీష్: మా చిన్నవాణ్ణి సమ్మర్ క్యాంప్‌కి పంపుతున్నాం.
స్నేహితుడు: సెలవుల్లో హాయిగా గడుపుతాడు.
సతీష్: వాడు కాదు మేం!
————————————————————————-
గొప్పలు
తన తండ్రి గురించి కొడుకు ఇలా చెబుతున్నాడు.
“మా నాన్న పులి, నరసింహ, ఠాగూర్” అన్నాడు. పక్కనే ఉన్న అతడి ఫ్రెండ్ ఇలా అన్నాడు. “అవునా మీ నాన్నను చూడాలంటే టిక్కెట్టెంత?” అన్నాడు.
————————————————————————-
ఆస్పత్రి బిల్
“డాక్టర్! ప్రతిరోజూ నాకో భయంకరమైన కల వస్తోంది. ఒక దయ్యం నన్ను తరుముతోంది. నేను పరిగెడుతూ ఉంటాను” అన్నాడు ఓ పేషంట్.
డాక్టర్ సీరియస్‌గా ఆలోచించి… “అరే! అది ప్రమాదకరమైన జబ్బండీ! ట్రీట్‌మెంట్‌కు దాదాపు లక్ష రూపాయల వరకు అవుతుంది” అన్నాడు.
ఆ మాటలకు అదిరిపోయిన పేషంట్. “డాక్టర్ గారూ! లక్ష రూపాయలా! అక్కర్లేదులెండి. నేను పరిగెత్తడం మానేసి ఆ దయ్యంతో ఫ్రెండ్‌షిప్ చేస్తాలే” అనేసి వెళ్లిపోయాడు.