జర నవ్వండి ప్లీజ్ 190
గాడిద తెలివి ఒకతన్ని ఓ గాడిద కాలితో తన్ని పరిగెత్తింది. అతను దాని వెంటపడ్డాడు. కనిపించకుండా పోయింది. సందుల్లో వెతుకుతూ ఉంటే ఒక జీబ్రా కనిపించింది. అతను దాన్ని బాదుతూ “నువ్వు కోటు వేసుకున్నంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా?” అన్నాడు. ——————————————————————— మంచిపని మాకు పిల్లల్లేరని కొందరు జాలిపడితే, “మేమిద్దరం దేశానికి చేసిన సేవ ఇదొక్కటే జనాభాని పెంచకపోవడం, మా కన్నా బుద్ధిలేని వాళ్ళని పుట్టించకపోవడం” అన్నారు. ——————————————————————— శబ్దరత్నాకరం న్యూఢిల్లీలో వరద రాజేశ్వరరావుగారు చాలాకాలం పాటు నివసించిన […]
గాడిద తెలివి
ఒకతన్ని ఓ గాడిద కాలితో తన్ని పరిగెత్తింది. అతను దాని వెంటపడ్డాడు. కనిపించకుండా పోయింది.
సందుల్లో వెతుకుతూ ఉంటే ఒక జీబ్రా కనిపించింది.
అతను దాన్ని బాదుతూ “నువ్వు కోటు వేసుకున్నంత మాత్రాన గుర్తుపట్టలేననుకున్నావా?” అన్నాడు.
———————————————————————
మంచిపని
మాకు పిల్లల్లేరని కొందరు జాలిపడితే, “మేమిద్దరం దేశానికి చేసిన సేవ ఇదొక్కటే జనాభాని పెంచకపోవడం, మా కన్నా బుద్ధిలేని వాళ్ళని పుట్టించకపోవడం” అన్నారు.
———————————————————————
శబ్దరత్నాకరం
న్యూఢిల్లీలో వరద రాజేశ్వరరావుగారు చాలాకాలం పాటు నివసించిన ఇల్లు “15 పూసారోడ్” ప్రధానమార్గం పక్కన ఉండేది. ఆ మార్గాన నిరంతరం పోయే వాహనాలు చేసే శబ్దాల వల్ల ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండేది కాదు. అయినా అది ఆయనకు చాలా నచ్చిన ఇల్లు. దానికి ఆయన ముద్దుగా “శబ్దరత్నాకరం” అని పేరు పెట్టారు.