నేటి నుంచే అసెంబ్లీ... అస్త్రశస్త్రాలతో అన్నిపక్షాలు రెడీ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30లకు ఆరంభమయ్యే ఈ సమావేశాల్లో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు నివాళులర్పించనున్నారు. అసెంబ్లీ సెక్షన్‌ 344 కింద ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నోటీసు ఇవ్వనుంది. అసెంబ్లీలో చర్చకు 12 అంశాలను గుర్తించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ… ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైనట్లు […]

Advertisement
Update:2015-08-30 17:32 IST

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30లకు ఆరంభమయ్యే ఈ సమావేశాల్లో వాడివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంకు నివాళులర్పించనున్నారు. అసెంబ్లీ సెక్షన్‌ 344 కింద ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చర్చకు ప్రభుత్వం నోటీసు ఇవ్వనుంది. అసెంబ్లీలో చర్చకు 12 అంశాలను గుర్తించినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ… ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ప్రజాధనాన్ని వృధా చేయకుండా అసెంబ్లీలో సమస్యలపై అర్థవంతమైన చర్చలు చేపట్టాలని సభ్యులకు ఆయన సూచించారు. అసెంబ్లీ వేదిక చాలా పవిత్రమైనదని, సభ్యులు ప్రజా సమస్యలను లేవనెత్తాలని, వాటిపై చర్చలు జరపాలని కోరారు. ప్రభుత్వానికి సూచనలు చేయాలని, తప్పుచేస్తే నిలదీయాలని అందులో తప్పు లేదని ఆయన అన్నారు. సమస్యలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుందని, సమస్యల పరిష్కారానికి అందరూ కృషి చేయాలని, ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని సభ్యులకు ఆయన విజ్ఙప్తి చేశారు. అర్థవంతమైన చర్చలు జరగాలని కోడెల శివప్రసాద్‌ కోరారు. ఈసారి ఏపీ వర్షాకాల సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. కీలక బిల్లులపై చర్చకు సిద్ధమని మంత్రులు చెబుతుంటే సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామంటోంది విపక్షం. దీంతో వర్షాకాల సమావేశాలు వాడి, వేడిగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News