జర నవ్వండి ప్లీజ్ 186

వస్త్రాపహరణం స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌: విద్యార్థుల్ని ఉద్దేశించి “టెక్ట్స్‌బుక్స్‌లో ఉన్న ద్రౌపతీ వస్త్రాపహరణం పాఠం ఎవరు చెప్పారు?” అని వాకబు చేస్తూ “ద్రౌపతీ వస్త్రాపహరణం ఎవరు పూర్తి చేశారు?” అని అడిగాడు. స్టూడెంట్‌: “ఆ రోజు టీచర్‌ రాలేదు. అందుకని హెడ్మాస్టర్‌ చేశారు” అన్నాడు. ———————————————————————————————- అందం “ఆ అమ్మాయి ఎందుకు నన్ను చూడడం లేదు?” “అద్దంలో చూసుకో తెలుస్తుంది” ———————————————————————————————- చిన్న గీత-పెద్ద గీత మొదటి వ్యక్తి: నేనీ నగరానికి చెప్పుల్లేకుండా వచ్చాను రెండో వ్యక్తి: నేను […]

Advertisement
Update:2015-08-25 18:33 IST

వస్త్రాపహరణం
స్కూల్‌ ఇన్‌స్పెక్టర్‌: విద్యార్థుల్ని ఉద్దేశించి “టెక్ట్స్‌బుక్స్‌లో ఉన్న ద్రౌపతీ వస్త్రాపహరణం పాఠం ఎవరు చెప్పారు?” అని వాకబు చేస్తూ “ద్రౌపతీ వస్త్రాపహరణం ఎవరు పూర్తి చేశారు?” అని అడిగాడు.
స్టూడెంట్‌: “ఆ రోజు టీచర్‌ రాలేదు. అందుకని హెడ్మాస్టర్‌ చేశారు” అన్నాడు.
———————————————————————————————-
అందం
“ఆ అమ్మాయి ఎందుకు నన్ను చూడడం లేదు?”
“అద్దంలో చూసుకో తెలుస్తుంది”
———————————————————————————————-
చిన్న గీత-పెద్ద గీత
మొదటి వ్యక్తి: నేనీ నగరానికి చెప్పుల్లేకుండా వచ్చాను
రెండో వ్యక్తి: నేను బట్టలే లేకుండా వచ్చాను
మొదటి వ్యక్తి: అదెలా?
రెండో వ్యక్తి: నేను పుట్టింది ఇక్కడే!
———————————————————————————————-
వృథా
తండ్రి: నీకు నెలకు వెయ్యి రూపాయిలిస్తాను. దురలవాట్లు మానుకో.
కొడుకు: దురలవాట్లు లేకుంటే నువ్వు ఇచ్చే వెయ్యి రూపాయలు ఏం చేసుకోవాలి?

Tags:    
Advertisement

Similar News