విభజన పాపం... తండ్రి ఆత్మహత్యాయత్నం
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలులో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. తెలంగాణలో చదివిన తన కుమార్తెకు ఏపీ డీఎస్సీలో అర్హత లేదన్న కోర్టు తీర్పుపై మనస్తాపంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థుల విషయంలో దారుణంగా వ్యవహరిస్తోందని కుటుంబసభ్యులు ఆరోపించారు. రాష్ట్ర విభజన తమ కుటుంబాన్ని నాశనం చేసిందని వారు దుయ్యబట్టారు.
Advertisement