జర నవ్వండి ప్లీజ్ 184

ఎంగేజ్‌మెంట్‌ అందగత్తె లత: అతను నన్ను ప్రపంచంలో అందరికన్నా అందగత్తెవన్నాడు. స్నేహ: ఎంగేజ్‌మెంట్‌ కాకముందే నీతో అబద్ధాలు చెప్పే అతని పట్ల జాగ్రత్తగా ఉండు. —————————————————————————— కట్నం తీసుకోనివాడు “కానీ కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లాడతాను!” అన్నాడు ప్రియురాలితో మధు. “అంత నిస్వార్థపరుడివైతే నన్నెలా పోషిస్తావు? మరెవరినైనా చూసుకో” అంది సునీత ———————————————————————————- శబ్దం గైడు: “నయాగరా జలపాతానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది ప్రపంచంలోకెల్లా పెద్ద జలపాతం. ఈ జలపాత శబ్దం ఎంతో గంభీరమైంది. ఇరవై సూపర్‌సానిక్‌ […]

Advertisement
Update:2015-08-23 18:33 IST

ఎంగేజ్‌మెంట్‌ అందగత్తె
లత: అతను నన్ను ప్రపంచంలో అందరికన్నా అందగత్తెవన్నాడు.

స్నేహ: ఎంగేజ్‌మెంట్‌ కాకముందే నీతో అబద్ధాలు చెప్పే అతని పట్ల జాగ్రత్తగా ఉండు.
——————————————————————————
కట్నం తీసుకోనివాడు
“కానీ కట్నం తీసుకోకుండా నిన్ను పెళ్లాడతాను!” అన్నాడు ప్రియురాలితో మధు.
“అంత నిస్వార్థపరుడివైతే నన్నెలా పోషిస్తావు? మరెవరినైనా చూసుకో” అంది సునీత
———————————————————————————-
శబ్దం
గైడు: “నయాగరా జలపాతానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇది ప్రపంచంలోకెల్లా పెద్ద జలపాతం. ఈ జలపాత శబ్దం ఎంతో గంభీరమైంది. ఇరవై సూపర్‌సానిక్‌ విమానాలు దీని దగ్గరగా వెళ్లినా వాటి శబ్దం కూడా మనకు వినిపించదు. ఇక్కడున్న స్త్రీలు మౌనంగా ఉంటే మనం జలపాతం శబ్దం వినవచ్చని మనవి చేస్తున్నా” అన్నాడు.
———————————————————————————-
వాళ్లకు అర్థం కాలేదు
జడ్జి దొంగతో: ఏమయ్యా! ఇంతకు ముందు వచ్చినపుడు మళ్లీ నీ ముఖం నాకు చూపించకు అన్నాను కదా! ఎందుకొచ్చావు?
దొంగ: ఆ సంగతే నేను పోలీసులతో చెబితే వాళ్లు వినిపించుకోలేదండీ!

Tags:    
Advertisement

Similar News