జర నవ్వండి ప్లీజ్ 182
అంతా మీ ఇష్టం “ఐతే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావన్న మాట. మరి ముహూర్తం ఎప్పుడనుకుంటున్నావు? “ఆ విషయం మీ అమ్మాయికి వదిలేశాను?” “మరి గుళ్లోనా? మేరేజ్‌హాలా?” “ఆ విషయం మీ ఆవిడకు వదిలేశాను” “మరి ఎలా బతుకుదామనుకుంటున్నావు?” “ఆ విషయం మీకు వదిలేశాను” —————————————————————————— డబ్బుప్రేమ బాగా డబ్బున్నఅమ్మాయి, పేదవాడు నిజాయితీపరుడు అయిన అబ్బాయిని ప్రేమించింది. అబ్బాయితో “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా డబ్బునా?” అంది. “నిన్నే” అన్నాడు. అమ్మాయి “మరి డబ్బును కాదా” అంది. […]
అంతా మీ ఇష్టం
“ఐతే మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావన్న మాట. మరి ముహూర్తం ఎప్పుడనుకుంటున్నావు?
“ఆ విషయం మీ అమ్మాయికి వదిలేశాను?”
“మరి గుళ్లోనా? మేరేజ్‌హాలా?”
“ఆ విషయం మీ ఆవిడకు వదిలేశాను”
“మరి ఎలా బతుకుదామనుకుంటున్నావు?”
“ఆ విషయం మీకు వదిలేశాను”
——————————————————————————
డబ్బుప్రేమ
బాగా డబ్బున్నఅమ్మాయి, పేదవాడు నిజాయితీపరుడు అయిన అబ్బాయిని ప్రేమించింది. అబ్బాయితో “నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా డబ్బునా?” అంది.
“నిన్నే” అన్నాడు. అమ్మాయి “మరి డబ్బును కాదా” అంది. “నిన్ను ప్రేమిస్తే నీ డబ్బును ప్రేమించినట్లే కదా!” అన్నాడు.
——————————————————————————
టైం పాస్
వేణు రోజూ సాయంత్రాలు సరోజతో కూచుని టీ తాగుతూ రెండు గంటలు గడిపేవాడు.
వెంకట్ “వేణూ! నువ్వు రోజూ సాయంత్రాలు సరోజతో గడుపుతావు కదా! ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా!” అన్నాడు.
వేణు “చేసుకోవచ్చు. కానీ అప్పుడు సాయంత్రాలు ఎవరితో గడపాలి?” అన్నాడు.
——————————————————————————
సలహా
“అవునయ్యా! నిన్ను మా అమ్మాయి ఇష్టపడింది. అది చాలు కదా. నా దగ్గరకు ఎందుకొచ్చావ్?”
“ఏం లేదు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చో లేదో మీరు సలహా ఇస్తారని?”