క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాడు....గోమాత ద‌య‌తో బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు!

ఈ ఫొటోలో క‌న‌బ‌డుతున్న వ్య‌క్తి పేరు అమిత్ వైద్య‌. ఇర‌వై ఏడు సంవ‌త్స‌రాల వ‌య‌సులో క్యాన్స‌ర్ బారిన ప‌డిన అమిత్, వ్యాధిని జ‌యించి కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాడు. మృత్యుముఖంలోకి వెళ్లి బ‌య‌ట‌ప‌డిన అత‌ను త‌న‌కు మ‌రో జ‌న్మనిచ్చింది గోమాతే అంటున్నాడు. త‌న‌లాంటి బాధితుల‌కోసం ఒక స్వ‌చ్ఛంద సంస్థ‌ని ఏర్పాటు చేసి న‌డుపుతున్నాడు. అమిత్ గురించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే…  గుజ‌రాతీ అయిన అమిత్ అమెరికాలోనే పుట్టి పెరిగాడు. ఎక‌న‌మిక్స్ లో పిహెచ్‌డి చేశాడు. చిన్న‌త‌నంనుండి అత‌నికి జీవితంలో ఎన్నో సాధించేయాల‌నే క‌ల‌లు చాలా ఉండేవి.అందుకు […]

Advertisement
Update:2015-08-21 18:49 IST

ఈ ఫొటోలో క‌న‌బ‌డుతున్న వ్య‌క్తి పేరు అమిత్ వైద్య‌. ఇర‌వై ఏడు సంవ‌త్స‌రాల వ‌య‌సులో క్యాన్స‌ర్ బారిన ప‌డిన అమిత్, వ్యాధిని జ‌యించి కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాడు. మృత్యుముఖంలోకి వెళ్లి బ‌య‌ట‌ప‌డిన అత‌ను త‌న‌కు మ‌రో జ‌న్మనిచ్చింది గోమాతే అంటున్నాడు. త‌న‌లాంటి బాధితుల‌కోసం ఒక స్వ‌చ్ఛంద సంస్థ‌ని ఏర్పాటు చేసి న‌డుపుతున్నాడు. అమిత్ గురించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే…

గుజ‌రాతీ అయిన అమిత్ అమెరికాలోనే పుట్టి పెరిగాడు. ఎక‌న‌మిక్స్ లో పిహెచ్‌డి చేశాడు. చిన్న‌త‌నంనుండి అత‌నికి జీవితంలో ఎన్నో సాధించేయాల‌నే క‌ల‌లు చాలా ఉండేవి.అందుకు త‌గిన‌ట్టుగానే శ‌క్తికి మించి శ్ర‌మ‌ప‌డుతుండేవాడు. ఓ ఎంట‌ర్‌టైన్ మెంట్ కంపెనీలో వాణిజ్య విభాగంలో ప‌నిచేసేవాడు. ప‌నిచేయ‌డ‌మే వ్య‌స‌నంగా ఉండ‌టం వ‌ల‌న అత‌ని జీవ‌న శైలి ఆరోగ్య‌క‌రంగా ఉండేది కాదు, ఆహారం నిద్ర విశ్రాంతి ఇవేమీ స‌రిగ్గా ఉండేవి కావు. ఆ ప్ర‌భావం అమిత్ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తూ వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గా అమిత్ తండ్రి హ‌ఠాత్తుగా మ‌ర‌ణించాడు. ఆవెంట‌నే అమిత్‌కి గ్యాస్ట్రిక్ క్యాన్స‌ర్ మొద‌టి ద‌శ‌లో ఉన్న‌ట్టుగా తేలింది.

న్యూయార్క్ లో కీమోథెర‌పీ తీసుకున్నాడు. కోలుకున్నాడు. అయితే అదే స‌మ‌యంలో అత‌ని త‌ల్లికి బ్రెయిన్ ట్యూమ‌ర్ చివ‌రి ద‌శ‌లో ఉంద‌ని తేలింది. అలా త‌ల్లిని పోగొట్టుకుని ఒంట‌రిగా మిగిలాడు. ఆ నిరాశా నిస్పృహ‌ల్లో జ‌బ్బు మ‌రొక‌సారి తిర‌గ‌బెట్టింది. ఈసారి లివ‌ర్‌కి. అయితే ఈ సారి అత‌ని శ‌రీరం చికిత్స‌కు సైతం స‌హ‌క‌రించ‌డం లేద‌ని డాక్ట‌ర్లు తేల్చేశారు. క్యాన్స‌ర్ ఊపిరితిత్తుల‌కు సైతం సోకింది. ఇదంతా 2011లో జ‌రిగింది. డాక్ట‌ర్లు ఇక అత‌ను కొద్దికాల‌మే బ‌తుకుతాడ‌ని చెప్పేశారు. త‌ల్లిదండ్రుల మ‌ర‌ణాన్ని ద‌గ్గ‌ర‌గా చూసి ఉండ‌టం వ‌ల‌న అమిత్ కి చావంటే భ‌యం క‌ల‌గ‌లేదు. త‌న అంత్యక్రియ‌ల‌కు ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధ‌ప‌డ్డాడు. త‌న త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌వబోతున్నాను అని సినిమాటిక్‌గా అనుకునేవాడు. చివ‌రికి బంధువుల‌ను చూసి చ‌నిపోవాల‌ని ఇండియా వ‌చ్చాడు.

కానీ అత‌ని అనారోగ్యం చూసి ఎవ‌రూ అండ‌గా నిల‌వ‌లేదు. ఇక పూర్తిగా నిరాశానిస్పృహల్లో ఉన్న‌పుడు గుజ‌రాత్ లో ఉన్న ఆయుర్వేద ఆసుప‌త్రి గురించి తెలిసింది. గుజ‌రాత్ వెళ్లాడు. అక్క‌డ ఆసుప‌త్రిలో మందులతో పాటు యోగా, మెడిటేష‌న్ ఉండేవి. నిష్ఠ‌గా చేశాడు. ఎంతో న‌మ్మ‌కంతో చికిత్స తీసుకున్నాడు. దేశీయ ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ‌, మూత్రం…ఇవ‌న్నీ ఔష‌ధాలుగా ఉండేవి. ఉద‌యాన్నే గోమూత్రం తాగాల్సి వ‌చ్చేది కానీ కీమోథెర‌పీతో నోరు అరుచిగా మారిపోవ‌డంతో త‌న‌కేమీ తెలిసేది కాదంటాడు అమిత్‌. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. వ్యాధి త‌గ్గ‌లేదు కానీ పెరుగుద‌ల ఆగింది. అమిత్ తిరిగి ఆసుప‌త్రికి వెళ్లాడు. న‌ల‌భై రోజుల్లో వ్యాధి త‌గ్గ‌డం మొద‌లైంది. చికిత్స‌ని కొన‌సాగించాల‌నుకున్నాడు. ఒక రైతుకి చెందిన గోశాల‌లో మంచం వేసుకుని ప‌డుకునేవాడు. ఒక బావి, టాయిలెట్ ప‌క్క‌నే ఉండేవి. కొన్ని నెల‌ల త‌రువాత న‌డ‌వ‌డం సాధ్య‌మైంది, త‌ర‌వాత జాగింగ్‌, ప‌రుగు….

గ్రామ‌స్తులు త‌న‌తో మాటామంతీ క‌ల‌ప‌డం త‌న‌కెంతో ఉప‌శాంతినిచ్చేదంటాడు అమిత్. 18నెల‌ల త‌రువాత అత‌ను క్యాన్స‌ర్‌ని పూర్తిగా జ‌యించాడు. అంత్య‌ద‌శ‌లో ఉన్న‌వాడు కాస్తా మ‌రోసారి జన్మ‌నెత్తాడు. అయితే అమిత్ తిరిగి అమెరికా వెళ్లిపోలేదు. అత‌నికి త‌న జీవిత ధ్యేయ‌మేమిటో తెలిసింది. హీలింగ్ వైద్య అనే స్వ‌చ్ఛంద సంస్థ‌ని ఏర్పాటు చేశాడు. త‌న అనుభ‌వాల‌ను వివ‌రిస్తూ హోలీ క్యాన్స‌ర్ అనే పుస్త‌కాన్ని రాశాడు. ఇక తిరిగి అమెరికా వెళ్లే ఉద్దేశం లేద‌ని, ఈ దేశం త‌న‌కు ఎంతో ఇచ్చింద‌ని, ఇక్క‌డ నివ‌సించే జ‌నం ఆ విష‌యా న్ని గుర్తించ‌డం లేద‌ని అమిత్ వైద్య అంటున్నాడు. ఇంకా అత‌ని గురించి తెలుసుకోవాలంటే healingvaidya.org లో చూడ‌వ‌చ్చు.

Tags:    
Advertisement

Similar News