న్యూడ్... బ్యాడ్ కాదంటున్న మోడల్స్!
ప్రపంచం అనేది మన దృష్టిలో ఒకటే పదం కానీ, మనకు తెలియని ప్రపంచాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కోల్‌కతాలోని న్యూడ్ మోడళ్ల ప్రపంచం అలాంటిదే. న్యూడ్ ఫొటోగ్రఫీకిపోజులిస్తున్న ఈ మోడల్స్ ఇందులో అసభ్యత ఏమీ లేదంటున్నారు. ఇందులో ఉన్నది సౌందర్య దాహం, కళా పిపాసేనని చెబుతున్నారు. అయితే దీన్ని ఒక ఉపాధిగా, కళగా, అందమైన ఫొటోగ్రఫిగా, మానవ విజ్ఞాన శాస్త్ర పరిశోధనకు అవసరమైన సైంటిఫిక్ చిత్రాలుగా, అందాన్ని బంధించే కెమెరా కళ్లకు నకళ్లుగా, వ్యక్తి స్వేచ్ఛగా ….ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనిషి సమాజంలో […]
ప్రపంచం అనేది మన దృష్టిలో ఒకటే పదం కానీ, మనకు తెలియని ప్రపంచాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కోల్‌కతాలోని న్యూడ్ మోడళ్ల ప్రపంచం అలాంటిదే. న్యూడ్ ఫొటోగ్రఫీకిపోజులిస్తున్న ఈ మోడల్స్ ఇందులో అసభ్యత ఏమీ లేదంటున్నారు. ఇందులో ఉన్నది సౌందర్య దాహం, కళా పిపాసేనని చెబుతున్నారు. అయితే దీన్ని ఒక ఉపాధిగా, కళగా, అందమైన ఫొటోగ్రఫిగా, మానవ విజ్ఞాన శాస్త్ర పరిశోధనకు అవసరమైన సైంటిఫిక్ చిత్రాలుగా, అందాన్ని బంధించే కెమెరా కళ్లకు నకళ్లుగా, వ్యక్తి స్వేచ్ఛగా ….ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనిషి సమాజంలో పెట్టుకున్న కట్టుబాట్లకు ఇది ఎదురీతే. అందుకే ఈ ఆర్టిస్టులకు సమాజంలో విమర్శలు ఎదురవుతుంటే… ఫొటోగ్రాఫర్లకు ఎప్పటికప్పుడు ఆర్టిస్టుల కొరత ఉంటూనే ఉంది.
దీనిపై ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కనపెడితే ఇందులోకి ప్రవేశిస్తున్న యువత మాత్రం మారుతున్న సామాజిక దృక్పథానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. కోల్‌కతా లోని ప్రభుత్వ ఆర్ట్ స్కూళ్లలో మోడల్స్ గా పనిచేసే అమ్మాయిలు ఎక్కువగా ఇప్పుడు ఈ బాట పడుతున్నారు. ఒక్కసారి కెమెరా ముందు నగ్నంగా పోజిస్తే చాలు నెలకు సరిపడా ఆదాయం లభిస్తుండడంతో ఇది వారికి లాభసాటి ఉపాధిగా కనబడుతోంది. ఈ ఫొటోగ్రఫీలో చాలావరకు మొహాలు కనిపించకుండా తీస్తారు.
24 సంవత్సరాల బేదశ్రీ కొన్నేళ్ల క్రితం గ్రూపు థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. అలా ఉండగా ఒక మేకప్ ఆర్టిస్టు ఆమెకు న్యూడ్ ఫొటోగ్రఫీ అవకాశాన్ని తీసుకువచ్చాడు. తొలిసారి అలా…చేసినపుడు…తనకి దుస్తులు ఉన్నా లేకపోయినా కెమెరాముందు ఒకలాగే అనిపించిందని, తరువాత… మూడో షూట్ కల్లా తనలోని బెరుకు, బిడియం పటాపంచలయ్యాయని ఆమె తెలిపింది. దాంతో ఎలాంటి బెరుకు లేకుండా ఈ వృత్తిలో కొనసాగుతున్నానని చెప్పింది. ఒకసారి తన ఫొటోలు ఒక పోర్న్ మేగజైన్ మీద రావడంతో తన తండ్రికి బాగా కోపం వచ్చిందని, అయితే తాను తన వృత్తిలో గౌరవంగా బతుకుతున్నానని, తాను చేస్తున్నది నేరం కాదని చెప్పడంతో ఆయన నెమ్మదించారని బేద్రశీ చెబుతోంది. అయితే తమని సెక్స్ వర్కర్లలా చూడటమే బాధగా ఉంటుందని, తన వృత్తి కారణంగా తన ఇంటి చుట్టుపక్కల వారు సైతం తనతో మాట్లాడటం మానేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఈ వృత్తిలో బేదశ్రీ తీసుకున్న అత్యధిక పారితోషకం లక్షా యాభైవేలు. మామూలుగా అయితే నాలుగు గంటలకు 15వేలు ఛార్జ్ చేస్తుంది. ఆపై ప్రతిగంటకూ 10వేల చొప్పున వసూలు చేస్తుంది. అయితే ఇప్పుడు ఈమె షూట్‌కి ముందు ఒక నిబంధన కచ్ఛితంగా పెడుతోంది. ఆయా ఫొటోలను పోటీలకు కానీ, ప్రదర్శనలకు గానీ విదేశాల్లోనే వాడాలని మనదేశంలో వాడకూడదని.
ఈమె మనోభావాలు ఇలా ఉంటే 22 ఏళ్ల బ్రోతి ప్రియ అభిప్రాయాలు మరోలా ఉన్నాయి. ఫొటోగ్రఫీని, ఫొటోగ్రఫిలాగే చూడాలని దాన్ని న్యూడ్ అనే పేరుతో వేరుగా చూడక్కర్లేదని ఆమె అంటోంది. అయితే ఇలాంటి షూట్ల లో తనకి ఎంతవరకు మానసికంగా సౌకర్యవంతంగా ఉంది అనే విషయాన్ని చూసుకుంటానని, అందుకే స్నేహితులు, తెలిసినవారితో మాత్రమే తాను ఈ షూట్‌లో పాల్గొంటున్నట్టుగా, ఎలాంటి పారితోషకం తీసుకోవడం లేదని చెప్పింది. మరి ఇంట్లో ఏమీ అనరా…అంటే నేను చిన్నపిల్లను కాను, నాకు పర్మిషన్ అవసరమా అంటోందీ అమ్మాయి.
శతాక్షీ గంగూలీ అనే 22 ఏళ్ల అమ్మాయి తన న్యూడ్ దేహంతో పాటు మొహాన్ని సైతం ప్రదర్శిస్తుంది. న్యూడిటీ, వల్గారిటీ రెండూ ఒకటి కాదని వేరువేరని, మన ఇండియన్ల మైండ్ సెట్ మారాలని ఈ అమ్మాయి చెబుతోంది. విదేశీయుల్లో న్యూడ్ ఫొటోగ్రఫీలోని సౌందర్యతత్వాన్ని ఆరాధించే స్పృహ ఉంటుందంటోంది. ఆడవారే కాదు, మగవారిలోనూ న్యూడ్ మోడల్స్ ఉన్నారు. ప్రసేన్‌జిత్ దాస్ అనే 23ఏళ్ల యువకుడు ఒక షిఫ్టుకి పదివేలు తీసుకుంటాడు. అతను తన కెరీర్‌లో అత్యధికంగా తీసుకున్న పారితోషకం 50 వేలు. అయితే న్యూడ్ ఫొటోగ్రఫి ఇంకా విస్తరించాల్సి ఉందని, దీనికి మోడల్స్ కొరత బాగా ఉందని 21 సంవత్సరాల అభిర్‌ఘోష్ అనే ఫొటోగ్రాఫర్ అంటున్నాడు. ఈ మోడలింగ్‌కి ఆర్టిస్టులు ఒప్పుకోవడం లేదని ఒప్పుకున్నా ఎక్కువ మొత్తం పారితోషకం చెల్లించాల్సి వస్తోందని, స్టూడియో రెంట్ కి దొరకడమూ కష్టంగానే ఉందని, ఇవన్నీ కాక తమకు తగిన గుర్తింపు దొరకడం లేదని అతను తమ కష్టాలు చెప్పుకొచ్చాడు. ఏదిఏమైనా దీన్ని వర్తమాన సామాజిక రీతులను బట్టి విశ్లేషించకుండా లోకో భిన్న రుచి….అంటే సరిపోతుంది.