తెలంగాణ ఇంటెలిజెన్స్ కి ఏపీ సీఐడీ నోటీసులు
ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య జెరూసలెంను బెదిరించారన్న ఆరోపణల కేసును దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో నోటీసులు అందించినట్టు తెలిసింది. వారం రోజులుగా గన్‌మెన్ జానకీరాం, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులివ్వాలని ప్రయత్నించారు. అయితే వారిని కలుసుకునే ప్రయత్నాలు విఫలం కావవడంతో వారి హెడ్‌క్వార్టర్ అయిన ఖైరతాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో అందించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రంలోగా అప్పాలోని తమ ప్రధాన కార్యాలయమైన సీఐడీకి రావాలని, సీఆర్పీసీ 160 కింద ఇచ్చిన […]
Advertisement
ఓటుకు కోట్లు కేసులో మత్తయ్య జెరూసలెంను బెదిరించారన్న ఆరోపణల కేసును దర్యాప్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో నోటీసులు అందించినట్టు తెలిసింది. వారం రోజులుగా గన్‌మెన్ జానకీరాం, డ్రైవర్ సత్యనారాయణకు నోటీసులివ్వాలని ప్రయత్నించారు. అయితే వారిని కలుసుకునే ప్రయత్నాలు విఫలం కావవడంతో వారి హెడ్‌క్వార్టర్ అయిన ఖైరతాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌లో అందించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రంలోగా అప్పాలోని తమ ప్రధాన కార్యాలయమైన సీఐడీకి రావాలని, సీఆర్పీసీ 160 కింద ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే ఈ నోటీసులను తాము పరిగణనలోకి తీసుకోలేమని, నేరుగా సంబంధిత వ్యక్తులకు ఇవ్వాలని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు తేల్చిచెప్పారు. అప్పటివరకు విచారణకు హాజరయ్యేలా గన్‌మెన్, డ్రైవర్‌కు తాము ఆదేశాలివ్వలేమన్నారు. ఇలా ఇచ్చిన నోటీసులు చెల్లవని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఇది ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.
Advertisement