రిషితేశ్వరి రెండో డైరీలో మరిన్ని పేర్లు !
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి రిషితేశ్వరికి సంబంధించి మరో డైరి వరంగల్‌లోని ఆమె స్వగృహంలో బయటపడింది. దీనిని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఏపీ పోలీసులకు, సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఇందులో అనేక కొత్త విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. తాజాగా ఆదిత్య, అభిషేక్ అనే కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. అన్నలా భావించిన వీరు తనను వేరే దృష్టితో చూశారని, వేధించారని ఆమె డైరీలో రాసుకుంది. వరస్ట్ కాలేజీలో అడుగుపెట్టానన్న ఆవేదనను మిగిల్చిందని తన మనోవేదనకు అక్షరరూపం […]
Advertisement
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి రిషితేశ్వరికి సంబంధించి మరో డైరి వరంగల్‌లోని ఆమె స్వగృహంలో బయటపడింది. దీనిని రిషితేశ్వరి తల్లిదండ్రులు ఏపీ పోలీసులకు, సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఇందులో అనేక కొత్త విషయాలు వెలుగుచూసినట్లు సమాచారం. తాజాగా ఆదిత్య, అభిషేక్ అనే కొత్తపేర్లు తెరపైకి వచ్చాయి. అన్నలా భావించిన వీరు తనను వేరే దృష్టితో చూశారని, వేధించారని ఆమె డైరీలో రాసుకుంది. వరస్ట్ కాలేజీలో అడుగుపెట్టానన్న ఆవేదనను మిగిల్చిందని తన మనోవేదనకు అక్షరరూపం కల్పించింది. ఫ్రెషర్స్ పార్టీ వేడుకలో తాను మిస్ ఫ్రెషర్‌గా ఎన్నికయ్యానని ఆ అవార్డును ప్రిన్సిపల్ బాబు రావు ఇవ్వకుండా సీనియర్ విద్యార్థి శ్రీనివాస్‌తో ఇప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. శ్రీనివాస్ అవార్డు ఇచ్చే వంకతో తన శరీరాన్ని పలుచోట్ల తాకాడని, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని డైరీలో రాసుకుంది. శ్రీనివాస్ తన ఫోన్ లాక్కుని వేధించారని పేర్కొంది. రిషితేశ్వరి తాజా డైరీలో ఆమె పలు కొత్త విషయాలు వెలుగుచూడటంతో కేసులో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రిన్సిపాల్ బాబురావు పాత్రపై ఎన్ని ఆధారాలు లభ్యమైనా పోలీసులు ఆయనపై మెతకగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిషితేశ్వరికి సంబంధించి మరో డైరీ వెలుగుచూసిన క్రమంలో ప్రిన్సిపాల్ బాబురావుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని విద్యార్థి సంఘాలు, రిషితేశ్వరి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.
Advertisement