ఒక్క కాల్‌తో 5 లక్షలు హాంఫట్‌!

అమాయకత్వమే ఆసరాగా ఐదు లక్షల కొట్టేశాడో మోసగాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నానని, మీ ఏటీఎం కార్డు బ్లాక్‌ అయ్యిందని, నగదు తీసుకోవాలంటే మళ్ళీ యాక్టివేట్‌ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. యాక్టివేట్‌ చేయమంటారా అంటూ అడిగాడు. ఓ.కే. అనగానే కార్డు నెంబర్‌ అడిగాడు. పిన్‌ అడిగాడు.. తర్వాత కార్డు వెనక ఉన్న కోడ్‌ నెంబర్‌ చెప్పమన్నాడు. ఇపుడు మేము ఫోన్‌ చేసిన నెంబర్‌కు ఓ కోడ్‌ వస్తుందని, దాన్ని మాకు చెప్పింతర్వాత మీ […]

Advertisement
Update:2015-08-12 09:42 IST
అమాయకత్వమే ఆసరాగా ఐదు లక్షల కొట్టేశాడో మోసగాడు. ఓ వ్యక్తి తాను బ్యాంకు నుంచి కాల్‌ చేస్తున్నానని, మీ ఏటీఎం కార్డు బ్లాక్‌ అయ్యిందని, నగదు తీసుకోవాలంటే మళ్ళీ యాక్టివేట్‌ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. యాక్టివేట్‌ చేయమంటారా అంటూ అడిగాడు. ఓ.కే. అనగానే కార్డు నెంబర్‌ అడిగాడు. పిన్‌ అడిగాడు.. తర్వాత కార్డు వెనక ఉన్న కోడ్‌ నెంబర్‌ చెప్పమన్నాడు. ఇపుడు మేము ఫోన్‌ చేసిన నెంబర్‌కు ఓ కోడ్‌ వస్తుందని, దాన్ని మాకు చెప్పింతర్వాత మీ కార్డు యాక్టివేట్‌ అవడానికి కొంచెం సమయం పడుతుందని తెలిపాడు. కొంచెం సేపు ఆగి ఫోన్‌కు వచ్చిన (ఒన్‌ టైం పాస్‌వర్డ్‌) ఓటీపీ నెంబర్‌ చెప్పమన్నాడు. అది తెలుసుకున్న తర్వాత మీ కార్డు కొంచెం సేపట్లో యాక్టివేట్‌ అవుతుందని చెప్పాడు. ఈలోగా సెల్‌ఫోన్‌లో చార్జింగ్‌ అయిపోవడంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిపోయింది. మళ్ళీ ఛార్జింగ్‌ పెట్టి ఫోన్‌ ఆన్‌ చేసే సరికి సదరు వ్యక్తి ఫోన్‌ నెంబర్‌కు బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్‌లు చూసి లబోదిబోమన్నాడు బాధితుడు తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన శీలం వీరబాబు. ఇంతకీ ఆ మెసేజ్‌ల్లో… మీరు బ్యాంకు నుంచి ఐదు లక్షల వెయ్యి రూపాయలు విత్‌ డ్రా చేశారని, ఒకవేళ ఈ లావాదేవీ మీరు చేసి ఉండకపోతే ఫిర్యాదు చేయవచ్చన్నది సారాంశం. మెసేజ్‌లో పేర్కొన్నట్టే అనపర్తి బ్యాంకుకు వెళ్ళి ఆరా తీయగా ‘మీరు ఆన్‌లైన్‌లో నగదు విత్‌డ్రా చేసుకుని అకౌంట్‌ క్లోజ్‌ చేశారు కదా’ అన్న సమాధానం వచ్చింది. దాంతో వీరబాబు ఇపుడు పోలీసు గుమ్మం ఎక్కి ఫిర్యాదు నమోదు చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ మోసానికిదో మచ్చుతునక!
Tags:    
Advertisement

Similar News