జర నవ్వండి ప్లీజ్ 172

చీరల ఛార్జీలు “మీ ఆయన నెలకు నాలుగు చీరలు ఎలా కొనిస్తున్నారే నీకు” ఆసక్తిగా అడిగింది శ్రీలక్ష్మి. “ఏముంది? మా నాన్నగారు వాళ్లకి ఢిల్లీ ట్రాన్స్‌ఫరైంది. అప్పటి నుంచి చీరలు కొనిపెట్టకపోతే నెలకోసారి మా పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరిస్తున్నా. రానుపోను ఖర్చులు ఒకసారి బేరీజు వేసుకుని వాటికంటే ఇదే బెటర్‌ అని ఫిక్సయిపోయారే” గడుసుగా చెప్పింది వెంకటలక్ష్మి. ——————————————————————– కాఫీ కొంతమంది కాలేజీ అమ్మాయిలు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి వెళ్లి కాఫీ ఆర్డర్‌ చేశారు. “బ్లాక్‌ కాఫీ […]

Advertisement
Update:2015-08-11 18:33 IST

చీరల ఛార్జీలు
“మీ ఆయన నెలకు నాలుగు చీరలు ఎలా కొనిస్తున్నారే నీకు” ఆసక్తిగా అడిగింది శ్రీలక్ష్మి.
“ఏముంది? మా నాన్నగారు వాళ్లకి ఢిల్లీ ట్రాన్స్‌ఫరైంది. అప్పటి నుంచి చీరలు కొనిపెట్టకపోతే నెలకోసారి మా పుట్టింటికి వెళ్లిపోతానని బెదిరిస్తున్నా. రానుపోను ఖర్చులు ఒకసారి బేరీజు వేసుకుని వాటికంటే ఇదే బెటర్‌ అని ఫిక్సయిపోయారే” గడుసుగా చెప్పింది వెంకటలక్ష్మి.
——————————————————————–
కాఫీ
కొంతమంది కాలేజీ అమ్మాయిలు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కి వెళ్లి కాఫీ ఆర్డర్‌ చేశారు.
“బ్లాక్‌ కాఫీ తెమ్మంటారా మేడమ్‌” అడిగాడు వెయిటర్‌.
“ఇంకా వేరే కలర్స్‌ ఏమేం ఉన్నాయి?” ముక్త కంఠంతో అడిగారు అమ్మాయిలంతా.
——————————————————————–
ఉపయోగం
సుజాత: “అమ్మ ఎందుకురా అలా తిడుతోంది?”
సునీల్‌: “మరేమో, ఎలక్ట్రిక్‌ వస్తువుల ఉపయోగమేంటో ప్రయోగాత్మకంగా చేసి చూపించేను.”
సుజాత: “ఏం చేసేవేంటి?”
సునీల్‌: “ఇస్త్రీ పెట్టి వెనకాల ఆమ్లెట్‌ వేశాను.”
——————————————————————–
వాయిదా
“నాకు ఆపరేషన్‌ ఇవాళే చేయాలా డాక్టర్‌? ఒక రెండు రోజులు వాయిదా వేయండి” అడిగాడు సురేష్‌.
“వేయొచ్చు కానీ నాకు కారు ఫైనాన్స్‌ చేసిన కంపెనీ ఒప్పుకోదయ్యా. ఇవాళే నా లోన్‌ కట్టడానికి లాస్ట్‌ డేట్‌. ఫ్లీజ్‌ కో-ఆపరేట్‌” చెప్పాడు డాక్టర్‌.

Tags:    
Advertisement

Similar News