కేంద్రాన్ని తప్పుపట్టిన ఏపీ హైకోర్టు
ఏపీ, తెలంగాణ ఉద్యోగుల విభజనపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వమే వారి మధ్య వివాదానికి కారణమని, కేంద్రం సకాలంలో స్పందించి ఉంటే వివాదాలు ఏర్పడేవి కావని హైకోర్టు వ్యాఖ్యానింది. స్థానికతపై విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం మంగళవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ […]
Advertisement
ఏపీ, తెలంగాణ ఉద్యోగుల విభజనపై కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వమే వారి మధ్య వివాదానికి కారణమని, కేంద్రం సకాలంలో స్పందించి ఉంటే వివాదాలు ఏర్పడేవి కావని హైకోర్టు వ్యాఖ్యానింది. స్థానికతపై విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదం మంగళవారం హైకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చింది. విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయంలో పూర్తి సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రం తరపున విచారణకు హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ బీ నారాయణరెడ్డిని హైకోర్టు ఆదేశించింది.
Advertisement