సంపన్న వ్యాపారి (For Children)

పూర్వం శ్రీనగర్‌లో ఒక సంపన్నుడయిన వ్యాపారస్తుడు ఉండేవాడు. అతన్ది చాలా పెద్ద ఇల్లు. అందమయిన పూలతోట, పళ్ళతోట. వసంతకాలంలో విరగబూచిన పూలతీగల్తో చూడ్డానికి అతని ఇల్లు ఇంద్రభవనంలా ఉండేది. నిజానికి అట్లాంటి ఇంట్లో ఆనందంగా, ప్రశాంతంగా జీవితం గడపవచ్చు. కాని ఆ వ్యాపారి సంకుచిత మనస్కుడు. ఎప్పుడూ ముఖం చిట్లించుకుంటూ ఉండేవాడు. పనివాళ్ళ మీద ఎగురుతూ ఉండేవాడు. కోపం వస్తే పనివాళ్ళ ముక్కు కోసేసేవాడు. అంత హింసించినా దిక్కులేనివాళ్ళు అక్కడ మంచి జీతం దొరుకుతుందని పనికి కుదిరే […]

Advertisement
Update:2015-08-09 18:32 IST

పూర్వం శ్రీనగర్‌లో ఒక సంపన్నుడయిన వ్యాపారస్తుడు ఉండేవాడు. అతన్ది చాలా పెద్ద ఇల్లు. అందమయిన పూలతోట, పళ్ళతోట. వసంతకాలంలో విరగబూచిన పూలతీగల్తో చూడ్డానికి అతని ఇల్లు ఇంద్రభవనంలా ఉండేది.

నిజానికి అట్లాంటి ఇంట్లో ఆనందంగా, ప్రశాంతంగా జీవితం గడపవచ్చు. కాని ఆ వ్యాపారి సంకుచిత మనస్కుడు. ఎప్పుడూ ముఖం చిట్లించుకుంటూ ఉండేవాడు. పనివాళ్ళ మీద ఎగురుతూ ఉండేవాడు. కోపం వస్తే పనివాళ్ళ ముక్కు కోసేసేవాడు. అంత హింసించినా దిక్కులేనివాళ్ళు అక్కడ మంచి జీతం దొరుకుతుందని పనికి కుదిరే వాళ్ళు. చివరకు ముక్కులు తెగివెళ్ళిపోయేవాళ్ళు. అట్లా కొన్నాళ్ళకు భయపడి ఎవరూ అతని దగ్గర పనికి చేరడం మానుకున్నారు.

వ్యవసాయంలో దెబ్బతిన్న రైతు బతుకు తెరువులేక శ్రీనగర్‌కు వచ్చి పనికోసం వెతుకుతూ వ్యాపారస్థుడి ఇంటివేపు వచ్చాడు. అప్పుడే ముక్కు తెగిన పనివాడు నెత్తీనోరూ మొత్తుకుంటూ వెళ్ళడం కనిపించింది. రైతు భయపడి పోయాడు. ఐనా అవసరం గనక వ్యాపారి దగ్గర పనికి చేరాడు. వ్యాపారి సవాలక్ష నిబంధనలు పెట్టాడు.

రోజులు గడుస్తున్నాయి. రైతుకు తన ఇల్లు, భార్య, పిల్లలు గుర్తుకు వచ్చారు. ఆ ఆలోచనల్లో ఉండి ఒకరోజు యజమానితో కొంత కరకుగా మాట్లాడాడు. దాంతో వ్యాపారి రైతు ముక్కు కోశాడు.

ముక్కు లేని ముఖంతో ఇంటికెలా వెళ్ళడం? రైతు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. మిత్రుడు ఏమైంది? అని అడిగాడు. రైతు జరిగిన విషయం చెప్పాడు. అంత దారుణం చేసిన వ్యాపారి మీద రైతు స్నేహితుడికి కోపం కట్టలు తెంచుకుంది. ‘సరే! నేను వాడి దగ్గర పనికి కుదిరి వాడికి తగిన బుద్ధి చెబుతాను’ అన్నాడు.

అన్నీ సర్దుకుని వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. ఇంత తక్కువ సమయంలో ఇంకో పనివాడు దొరికినందుకు వ్యాపారి సంతోఫించాడు. ఇప్పుడు వ్యాపారి గొర్రెతోలు కప్పుకున్న తోడేలు ‘ఇంట్లోకి వచ్చిందన్న సంగతి వ్యాపారి గమనించలేదు. వ్యాపారి నిబంధనలు విని రైతుమిత్రుడు నాకు ఏ నిబంధనలు వర్తిస్తాయో అవి మీకూ వర్తిస్తాయి. వాటిని మీరు అధిగమిస్తే నేను మీ ముక్కు కోస్తాను’ అన్నాడు.

ఆ మాటల్తో వ్యాపారి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఎందుకంటే ఏ పనివాడూ అంత ధైర్యంగా మాట్లాడడు. సరే చూద్దామని అంగీకారం తెలిపి వ్యాపారి అతన్ని పనిలో పెట్టుకున్నాడు.

యజమాని, సేవకుడు మధ్య ఎట్లాంటి ఉద్వేగాలూ లేకుండా ఆవేశకావేషాలూ లేకుండా నెలలు గడిచిపోయాయి. రెచ్చగొట్టడం కన్నా ఒకరిపట్ల ఒకరు మర్యాదగా ప్రవర్తించసాగారు.

వ్యాపారి భార్య ఒకరోజు ‘పొయ్యి మీద మాంసం వేశాను. ఉడుకుతూ ఉంది. చూస్తూ ఉండు. కాసేపు పనిమీద బయటికి వెళ్ళి వస్తాము’ అంది.

కాసేపటికి నీళ్ళు ఆవిరయ్యాయి. అడుగంటింది. మాడు వాసన వచ్చింది. మాంసం మాడి ఎరుపు నించీ నల్లగా మారింది. పక్కింటికి వెళ్ళిన వ్యాపారి భార్య వాసనకు పరుగుపరుగున వచ్చింది. మాంసం మాడిమసయింది. సేవకుడు చాలా వినయంగా కదలకుండా అక్కడే కూచుని చూస్తున్నాడు.

అట్లా ఒకటి రెండు సంఘటనలు జరిగినా ఎవరూ ఉద్రేకాన్ని తెచ్చుకోలేదు. అంతలో ఆగస్టులో వచ్చే ఒక పండుగలో గంగాబల్‌ అన్న సరస్సు దగ్గర ఉత్సవం జరుపుతారు. దానికి అన్నీ సిద్ధం చేస్తారు.

వ్యాపారి భార్యతో ఆ ఉత్సవానికి వెళుతూ సేవకుడితో ‘ఇల్లు జాగ్రత్త. ఎట్లాంటి ప్రమాదం జరగకుండా చూసుకో’ అని హెచ్చరించాడు.

సేవకుడు కూడా దైవభక్తుడు. ఆ ఉత్సవం చూడాలని ఉత్సుకత కలిగింది. ఇంట్లో సరుకుల్ని సంచుల్తో నింపి వాటికి రాళ్లు కట్టి మనుషుల్తో మోయించి దాల్‌ సరస్సులో వదిలి అవి లోపలికి వెళ్ళే దాకా ఉండి అక్కడినుండి బయల్దేరి గంగాబల్‌ సరస్సు దగ్గరికి వెళ్లాడు.

అక్కడ చలికి వెచ్చటి టీ తాగుతూ ఉల్లాసంగా ఉన్న తన యజమాని ముందు నిల్చున్నాడు. తన ముందు నిల్చున్న సేవకుణ్ణి చూసి ‘ఏమిటి? నువ్విక్కడున్నావు? ఇల్లు వదిలిపెట్టి వచ్చావా? ఇంట్లో విలువయిన సామాన్లు ఉన్నాయి. దొంగలు పడితే ఎలా’ అన్నాడు ఆందోళనగా.

సేవకుడు నెమ్మదిగా ‘యజమానీ! మీకా దిగులు అక్కర్లేదు అన్ని వస్తువుల్ని సంచుల్లో పెట్టి, కుట్టి దాల్‌ సరస్సులో భద్రంగా దాచి వచ్చాను’ అన్నాడు.

ఆ మాటల్తో వ్యాపారిలో ఆగ్రహం పెల్లుబికింది. ముఖం కందగడ్డలా ఎర్రబారింది. చెయ్యి ఎత్తి సేవకుణ్ణి చెంప పగలగొట్టాడు. దెబ్బ పెద్దగా తగిలినా సేవకుడు ఏడవడానికి బదులు గట్టిగా నవ్వాడు.

‘ఇప్పుడు నువ్వు నీ అదుపు కోల్పోయావు. మన నిబంధన బట్టి ఎవరు తమ అదుపు తప్పినా వాళ్ళు శిక్షార్హులు. నువ్వు నా మిత్రునికి చేసిన పనే నీకు చేస్తాను’ అని వ్యాపారి ముక్కు కోశేశాడు.

కోశాక వ్యాపారి మొత్తుకుంటూ ఉంటే దీనికి సాక్ష్యాలెవ్వరూ లేరు. నీకు దిక్కున్న చోట చెప్పుకో అని సేవకుడు తన మిత్రుడైన రైతుకు ఈ శుభవార్త చెప్పడానికి వెళ్ళాడు.

– సౌభాగ్య

Tags:    
Advertisement

Similar News