జర నవ్వండి ప్లీజ్ 170

ముఖ్యాంశాలు మరోసారి రాజు భార్య రాణి యాంకర్‌గా పని చేస్తోంది. ఎన్నేళ్ల నుంచో  న్యూస్‌ చదవడం ఆమెకు అలవాటైపోయింది. అయితే భక్తిలో మాత్రం ఆమె ఏ మాత్రం తగ్గదు. ఉదయం, రాత్రి దేవుడిని తలుచుకుంటూనే ఉంటుంది. ఓ రోజు రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేస్తూ చేస్తూ చివర్లో “భగవాన్‌! వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి” అంది. —————————————————————- వేధింపులు ఒక ఆవు, దూడ పొలంలో పడి మేస్తున్నాయి. పొలం యజమాని చాలాకోపంగా పొలంలో పనిచేస్తున్న […]

Advertisement
Update:2015-08-09 18:33 IST

ముఖ్యాంశాలు మరోసారి
రాజు భార్య రాణి యాంకర్‌గా పని చేస్తోంది. ఎన్నేళ్ల నుంచో న్యూస్‌ చదవడం ఆమెకు అలవాటైపోయింది. అయితే భక్తిలో మాత్రం ఆమె ఏ మాత్రం తగ్గదు. ఉదయం, రాత్రి దేవుడిని తలుచుకుంటూనే ఉంటుంది. ఓ రోజు రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేస్తూ చేస్తూ చివర్లో “భగవాన్‌! వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి” అంది.
—————————————————————-
వేధింపులు
ఒక ఆవు, దూడ పొలంలో పడి మేస్తున్నాయి. పొలం యజమాని చాలాకోపంగా పొలంలో పనిచేస్తున్న తన పనివాడితో “ఈ ఆవు, దూడ పొలంలో పడి మేస్తుంటే ఏం చేస్తున్నావురా. ఇవి ఎవరివో తెలుసా!” అని కోపంగా అడిగాడు.
“ఆవు ఎవరిదో తెలియదు కానీ దూడ ఎవరిదో తెలుసయ్య” అన్నాడు.
“ఎవరిది?”
“ఆ ఆవుది సార్‌”!
—————————————————————-
కుక్కముద్దు
ఇద్దరు ప్రేయసి ప్రియులు ట్యాంక్‌బండ్‌ మీద కూర్చుని గంటల కొద్దీ కబుర్లు చెప్పుకుంటున్నారు. పక్కనే ఒక కుక్క మరో కుక్కను ముద్దుపెట్టుకోవడం చూసి ప్రియుడు ప్రేయసితో “ఆ కుక్కల్ని చూశావా. నాక్కూడా అలా చేయాలనిపిస్తోంది” అన్నాడు.
వెంటనే ఆ ప్రేయసి “నాకేం అభ్యంతరం లేదు. కావాలంటే వెళ్లి ముద్దు పెట్టుకురండి. ఆ కుక్క కరిస్తే మాత్రం నా బాధ్యత కాదు” అంది.
—————————————————————-
సెలవు
ఒక ఉద్యోగి తన పై అధికారి దగ్గరకెళ్లి సార్‌ మా ఆవిడకు ఆరోగ్యం బాగోలేదు. ఆస్పత్రికి వెళ్లాలి. ఈ రోజు సెలవు ఇప్పించండి అని అడిగాడు. దానికి వెంటనే ఆ ఆఫీసరు భలే అబద్ధాలు చెబుతావు కదయ్యా. ఇంతకుముందే మీ ఆవిడ ఫోన్‌చేసి మా ఆయనకు బాగోలేదు. కొద్దిగా ఆలస్యంగా ఆఫీసుకు వస్తాడు అని లేటు పర్మిషన్‌ అడిగిందే అని అన్నాడా ఆఫీసరు.
దానికి ఆ ఉద్యోగి మీరు నా కన్నా అబద్దాలకోరులా ఉన్నారు సార్‌. నాకు పెళ్లికానిదే మా ఆవిడ మీకెట్లా ఫోన్‌ చేస్తుంది.

Tags:    
Advertisement

Similar News