సభకు సహకరిస్తామంటే సస్సన్షన్ ఎత్తేస్తాం: వెంకయ్య
సత్ప్రవర్తనతో సభా వ్యవహారాలకు సహకరిస్తామని స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు హామీ ఇస్తే 25 మంది కాంగ్రెస్ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ భవనం దగ్గర ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి సమాజ్‌వాది, వామపక్షాల నాయకులు సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తి వేయాల్సిందిగా చేసిన డిమాండును దృష్టిలో పెట్టుకుని వెంకయ్య ఈ మేరకు ప్రకటన చేశారు. అరుపులు, నినాదాలతో నిరసన తెలియజేయడం […]
Advertisement
సత్ప్రవర్తనతో సభా వ్యవహారాలకు సహకరిస్తామని స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు హామీ ఇస్తే 25 మంది కాంగ్రెస్ సభ్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ భవనం దగ్గర ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి సమాజ్‌వాది, వామపక్షాల నాయకులు సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తి వేయాల్సిందిగా చేసిన డిమాండును దృష్టిలో పెట్టుకుని వెంకయ్య ఈ మేరకు ప్రకటన చేశారు. అరుపులు, నినాదాలతో నిరసన తెలియజేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, జీరో అవర్‌లో సదరు అంశాన్ని లేవనెత్తవచ్చని తనను కలిసిన సీపీఎం నాయకుడు పి. కరుణాకరన్‌తో స్పీకర్ సుమిత్ర మహాజన్ అన్నారు. సస్పెండైన కాంగ్రెస్ ఎంపీలతో చేరి నిరసన తెలుపుతున్న సమాజ్‌వాది, వామపక్షాల సభ్యులు సభకు రావాలని భావిస్తే తాము సంతోషిస్తామని వెంకయ్య అన్నారు.
Advertisement