కవితా... చిన్నపిల్లలా మాట్లాడొద్దు: వెంకయ్య

హైకోర్టు విభజనకు కేంద్రం సహకరించడం లేదని, ఉమ్మడి హైకోర్టును అడ్డం పెట్టుకొని చంద్రబాబు తెలంగాణను పరిపాలించాలని భావిస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. కవిత చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించ వద్దన్నారు. సభలో చిన్నపిల్లల్లా మాట్లాడవద్దని సూచించారు. మీరు ఏం చేస్తారో చేసుకోండని, అవసరమైతే ప్రత్యేక హైకోర్టుపై సదానందగౌడ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని చెబుతామన్నారు. చంద్రబాబుపై ఎంపీ కవిత చేసిన […]

Advertisement
Update:2015-08-05 08:19 IST
హైకోర్టు విభజనకు కేంద్రం సహకరించడం లేదని, ఉమ్మడి హైకోర్టును అడ్డం పెట్టుకొని చంద్రబాబు తెలంగాణను పరిపాలించాలని భావిస్తున్నారని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో చేసిన ప్రకటన కలకలం సృష్టించింది. కవిత చేసిన ఆరోపణలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించ వద్దన్నారు. సభలో చిన్నపిల్లల్లా మాట్లాడవద్దని సూచించారు. మీరు ఏం చేస్తారో చేసుకోండని, అవసరమైతే ప్రత్యేక హైకోర్టుపై సదానందగౌడ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని చెబుతామన్నారు. చంద్రబాబుపై ఎంపీ కవిత చేసిన ఆరోపణలపై టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రమంత్రి సదానందగౌడ చేసిన ప్రకటన పాతదేనని అన్నారు. విభజన సందర్భంగా ఇరు రాష్ర్టాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తుందని ప్రశ్నించారు.
Tags:    
Advertisement

Similar News