వీఆర్‌కు మారేడ్‌పల్లి ఎస్ఐలు!
మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై ఆందోళనకారుల దాడిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. బన్నప్ప మృతిపై ఆరోపణలు రావడం, పోలీస్‌స్టేషన్‌పై దాడిని నిలువరించలేకపోయారనే కారణంతో ఇద్దరు ఎస్ఐలను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బన్నప్ప మృతి, పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను సీసీఎస్‌కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తును ఎనిమిది ప్రత్యేక బృందాలు చేపట్టాయి. స్టేషన్‌పై దాడి ఘటనతో సంబంధం […]
Advertisement
మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై ఆందోళనకారుల దాడిపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. బన్నప్ప మృతిపై ఆరోపణలు రావడం, పోలీస్‌స్టేషన్‌పై దాడిని నిలువరించలేకపోయారనే కారణంతో ఇద్దరు ఎస్ఐలను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. బన్నప్ప మృతి, పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటనలో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులను సీసీఎస్‌కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తును ఎనిమిది ప్రత్యేక బృందాలు చేపట్టాయి. స్టేషన్‌పై దాడి ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో పది మందిని పోలీసులు తమ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల దెబ్బలతో బన్నప్ప మృతి చెందాడా?
హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ వద్ద సోమవారంరాత్రి ఉద్రిక్తత నెలకొనడానికి పోలీసుల వైఖరే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి మృతి చెందడంతో..స్థానికులు ఆగ్రహానికి గురై పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి, ఎస్ఐలతో సహా కానిస్టేబుళ్లను తీవ్రంగా గాయపరిచారు. ట్రాన్స్‌కోలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న మహాత్మాగాంధీనగర్‌కు చెందిన బన్నప్పను ఓ కేసు విషయంలో ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం బన్నప్పను పంపించేశారు. ఇంటికొచ్చిన బన్నప్ప ఒక్కసారిగా కుప్పకూలిపోగా.. అతనిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో బన్నప్ప చనిపోవడంతో..స్థానికుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. పోలీసులు చితకబాదడంతోనే బన్నప్ప మరణించాడని ఆరోపిస్తూ స్థానికులు మృతదేహంతో వచ్చి నిరసనకు దిగారు. నిరసన ఉద్రికత్తంగా మారి విధ్వంసానికి దారి తీసింది. మారేడ్‌పల్లి స్టేషన్‌లోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, పీఎస్ వాహనాలు మూడింటికి నిప్పంటించారు. ఆందోళనకారులతో దాడిలో ఇద్దరు ఎస్ఐలతో సహా ఆరుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. విధ్వంసం అనంతరం పోలీసులు లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. మారేడ్‌పల్లి స్టేషన్‌పై పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు పోలీసులు దాడిలో గాయపడి మృతి చెందిన బన్నప్ప మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టమ్ పూర్తి అయ్యింది. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి స్వగృహానికి తరలించారు.
Advertisement