ఇకనుంచి 'పద్మశ్రీ' మోహన్‌బాబు

సినీ హీరో మోహన్‌బాబుకు పద్మశ్రీ అవార్డుకు ఉన్నఅడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పద్మశ్రీ అవార్డు దుర్వినియోగం చేశారంటూ దాన్ని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చి వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలు దఫాల విచారణ అనంతరం ఇకముందు పద్మశ్రీ అవార్డు దుర్వినియోగం చేయనంటూ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని సుప్రీం సూచించింది. దీంతో ఆయన తాను పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయనంటూ సుప్రీంకోర్టులో ప్రమాణపత్రాన్ని దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన […]

Advertisement
Update:2015-08-03 00:50 IST
సినీ హీరో మోహన్‌బాబుకు పద్మశ్రీ అవార్డుకు ఉన్నఅడ్డంకులు తొలగిపోయాయి. గతంలో పద్మశ్రీ అవార్డు దుర్వినియోగం చేశారంటూ దాన్ని స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చి వేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పలు దఫాల విచారణ అనంతరం ఇకముందు పద్మశ్రీ అవార్డు దుర్వినియోగం చేయనంటూ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని సుప్రీం సూచించింది. దీంతో ఆయన తాను పద్మశ్రీ అవార్డును దుర్వినియోగం చేయనంటూ సుప్రీంకోర్టులో ప్రమాణపత్రాన్ని దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కోట్టివేస్తూ మోహన్‌బాబు పద్మశ్రీ అవార్డు ఇకముందు కొనసాగుతుందని విస్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో ఆయన ఇక నుంచి తన పేరుకు ముందు పద్మశ్రీ వాడుకునే అవకాశం లభిస్తుంది.
Tags:    
Advertisement

Similar News