ర్యాగింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తాం: గంటా

తాడేపల్లిగూడెంలోనే నిట్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్థుతం స్థానిక వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీలో తరగతులు నిర్వహిస్తామన్నారు. ర్యాగింగ్ పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ర్యాగింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి అన్నారు. ప్రతి విద్యార్థి 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని మంత్రి గంటా తెలిపారు. నాగార్జునలో ర్యాంగింగే లేదు: ప్రిన్సిపాల్‌ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళశాలలో ర్యాగింగే జరగలేదని ప్రిన్సిపాల్ బాబూరావు అన్నారు. ర్యాగింగ్‌పై రిషితేశ్వరి తల్లిదండ్రులు తనకు […]

Advertisement
Update:2015-08-02 05:42 IST
తాడేపల్లిగూడెంలోనే నిట్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్థుతం స్థానిక వాసవి ఇంజినీరింగ్‌ కాలేజీలో తరగతులు నిర్వహిస్తామన్నారు. ర్యాగింగ్ పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని, ర్యాగింగ్‌ను ఉక్కుపాదంతో అణచివేస్తామని మంత్రి అన్నారు. ప్రతి విద్యార్థి 75 శాతం హాజరు ఉంటేనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందని మంత్రి గంటా తెలిపారు.
నాగార్జునలో ర్యాంగింగే లేదు: ప్రిన్సిపాల్‌
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ కళశాలలో ర్యాగింగే జరగలేదని ప్రిన్సిపాల్ బాబూరావు అన్నారు. ర్యాగింగ్‌పై రిషితేశ్వరి తల్లిదండ్రులు తనకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. అదేవిధంగా తాను మద్యం సేవించి పార్టీలో పాల్గొన్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఎదుట ప్రిన్సిపాల్ బాబూరావు, హాస్టల్ వార్డెన్ స్వరూప రాణి హాజరయ్యారు. హాస్టల్‌లో ర్యాగింగ్ నిరోధానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి తెలిపారు.
Tags:    
Advertisement

Similar News