జర నవ్వండి ప్లీజ్ 161

లోకల్ డాక్టర్: నీకు లోకల్ అనస్తీషియా ఇమ్మంటావా? పేషెంట్: వద్దండీ, ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఇంపోర్టెడ్ ఇవ్వండి. ————————————————- లేని రోగం! “కొవ్వు పదార్థాలు తగ్గించు. మటన్, చికెన్ మానెయ్, స్వీట్లు తినకు. రోజుకు మూడు సిగరెట్ల కన్నా ఎక్కువ తాగకు. వారంలో నీ ఆరోగ్యం కుదుట పడుతుంది” అని డాక్టర్ పంపేశాడు. వారం తరువాత పేషెంట్ వచ్చాడు. ఆయాస పడుతూ, నీరసంగా సోలుతూ, దగ్గుతున్నాడు. “ఏమైంది, నేను చెప్పినట్లు డైట్ మెయిన్టెయిన్ చేశావా?” అన్నాడు డాక్టర్. […]

Advertisement
Update:2015-07-31 18:33 IST

లోకల్
డాక్టర్: నీకు లోకల్ అనస్తీషియా ఇమ్మంటావా?
పేషెంట్: వద్దండీ, ఎంత ఖర్చయినా ఫరవాలేదు. ఇంపోర్టెడ్ ఇవ్వండి.
————————————————-
లేని రోగం!
“కొవ్వు పదార్థాలు తగ్గించు. మటన్, చికెన్ మానెయ్, స్వీట్లు తినకు. రోజుకు మూడు సిగరెట్ల కన్నా ఎక్కువ తాగకు. వారంలో నీ ఆరోగ్యం కుదుట పడుతుంది” అని డాక్టర్ పంపేశాడు.
వారం తరువాత పేషెంట్ వచ్చాడు. ఆయాస పడుతూ, నీరసంగా సోలుతూ, దగ్గుతున్నాడు.
“ఏమైంది, నేను చెప్పినట్లు డైట్ మెయిన్టెయిన్ చేశావా?” అన్నాడు డాక్టర్.
పేషెంట్ ఆయాసంతో “మీరు చెప్పినట్లే చేశాను డాక్టర్. చికెన్, మటన్ తినడం మానేశాను. కొవ్వు పదార్ధాలు మానేశాను. అవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించలేదు కానీ మూడు “సిగరెట్లు తాగడం నరకంలా ఉంది. దగ్గుతో చస్తున్నా. ఇంతకు పూర్వం ఎప్పుడూ నేను సిగరెట్లు తాగలేదు!” అన్నాడు.
————————————————-
నిద్రా భంగం
గవర్నమెంటు ఆఫీసు ముందున్న బోర్డులో ఇలా రాశారు “నిశ్శబ్దంగా ఉండండి”. దానికింద ఎవరో ఇంకో వాక్యం చేర్చారు “లేకుంటే నిద్రపోయే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది”.
————————————————-
పోలీసు కుక్క
ఒక పోలీసును కుక్క కరిచింది. అతను డాక్టర్ దగ్గరకు వచ్చాడు. డాక్టర్ “ఇది ఎలా జరిగింది” అన్నాడు. “నిజం చెప్పాలంటే అప్పుడు నేను యూనిఫాంలో లేను” అన్నాడు పోలీసు.

Tags:    
Advertisement

Similar News