ఇంటి ముందు చీర, పూలు, జాకెట్లతో నిరసన
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఎంపీ దివాకర్ రెడ్డి ఇంటి ముందు ఏఐవైఎఫ్ నాయకులు చీర, పూలు, జాకెట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో తేదేపా పార్లమెంటు సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ దివాకర్‌రెడ్డి నివాసం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. చేత కాకుంటే పదవుల నుంచి దిగిపోవాలని […]
Advertisement
ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఎంపీ దివాకర్ రెడ్డి ఇంటి ముందు ఏఐవైఎఫ్ నాయకులు చీర, పూలు, జాకెట్లతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాడటంలో తేదేపా పార్లమెంటు సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ దివాకర్‌రెడ్డి నివాసం వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. చేత కాకుంటే పదవుల నుంచి దిగిపోవాలని వారు డిమాండు చేశారు. ఏపీకి అన్యాయం జరుగుతుంటే కాకమ్మ కబుర్లు చెబుతూ ఎంపీలు కాలం వెళ్ళదీస్తున్నారని వారు ఆరోపించారు.
Advertisement