జర నవ్వండి ప్లీజ్ 160
అన్నీ కష్టమే! “రాజూ! నీలాగా లావుగా ఉన్న వాళ్ళు సాధారణంగా మంచి వాళ్ళయి ఉంటారు. ఎందుకంటావ్?” “ఏం లేదు వాళ్ళు పోట్లాడలేరు. పరిగెత్తలేరు కదా! అందుకని”. ———————————————————— చిన్న కోరిక “నీ చిన్నప్పటి కోరికలేవయినా నెరవేరాయా?” “ఒక్క కోరిక నెరవేరింది”. “ఏమిటది?” “చిన్నప్పుడు మా అమ్మ నా జుత్తుపట్టుకుని లాగినప్పుడల్లా దేవుడా! నాకు బట్టతల ఉంటే ఎంత బావుండేది?” అనుకునేవాణ్ణి. ఇప్పటికది నెరవేరింది. ———————————————————— ట్రైనింగ్ రోజూ ఒకడే వచ్చే బిచ్చగాడు ఆ రోజు ఇంకొకతన్ని వెంటబెట్టుకుని […]
అన్నీ కష్టమే!
“రాజూ! నీలాగా లావుగా ఉన్న వాళ్ళు సాధారణంగా మంచి వాళ్ళయి ఉంటారు. ఎందుకంటావ్?”
“ఏం లేదు వాళ్ళు పోట్లాడలేరు. పరిగెత్తలేరు కదా! అందుకని”.
————————————————————
చిన్న కోరిక
“నీ చిన్నప్పటి కోరికలేవయినా నెరవేరాయా?”
“ఒక్క కోరిక నెరవేరింది”.
“ఏమిటది?”
“చిన్నప్పుడు మా అమ్మ నా జుత్తుపట్టుకుని లాగినప్పుడల్లా దేవుడా! నాకు బట్టతల ఉంటే ఎంత బావుండేది?” అనుకునేవాణ్ణి. ఇప్పటికది నెరవేరింది.
————————————————————
ట్రైనింగ్
రోజూ ఒకడే వచ్చే బిచ్చగాడు ఆ రోజు ఇంకొకతన్ని వెంటబెట్టుకుని వచ్చాడు. ఆ ఇల్లాలు “ఐతే ఇప్పుడు ఒకరు ఇద్దరై బిచ్చ మెత్తుకుంటున్నారన్న మాట” అంది.
దానికి మొదటి బిచ్చగాడు “కాదమ్మా! మామూలుగా నేనే వస్తాను. నేను సెలవులో వెళితే ఏయే ఇళ్ళకు రావాలో ఇతనికి చూపిస్తున్నా” అన్నాడు.
————————————————————
గదుల గోల
టీచర్: రామూ! మీరు చాలా గదులున్న ఇల్లు కట్టారట కదా! కొత్త ఇల్లు ఎలా ఉంది?
రాము: చాలా బావుంది టీచర్. నాకు, మా ఇద్దరక్కలకు కూడా ప్రత్యేకంగా ఎవరి గదులు వాళ్ళకున్నాయి. పాపం మా అమ్మకే లేదు. ఇప్పటికీ పాపం మా నాన్న గదిలోనే ఉంటోంది.