జర నవ్వండి ప్లీజ్ 158

“సావనీరు…” మరో మేనకోడలు – మా ఆడపడుచు కూతురు నృత్య ప్రదర్శనకి చేస్తున్న ఏర్పాట్లలో “సావనీర్” ప్రచురించటం ఆలస్యం అయింది. చీటికీ మాటికీ మా ఆడబడుచూ వాళ్లూ “సావనీర్‌” ఎంత వరకు వచ్చిందో అడుగుతూంటే విసుక్కుంటూ “వీళ్లు నన్ను సావనీరు, బతకనీరు” అన్నారు! ————————————————————- “పద్మదూషణ్‌” ఎప్పుడూ ఎవరినో ఒకరిని తీవ్రంగా విమర్శించడం అలవాటున్న ఒక మిత్రుడికి “పద్మదూషణ్‌” అని బిరుదిచ్చారు! వరద రాజేశ్వరరావుగారు. ————————————————————- ఉపన్యాసం రాజకీయ నాయకుడు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నాడు. “మనరాష్ట్రంలో వంద […]

Advertisement
Update:2015-07-28 18:33 IST

“సావనీరు…”
మరో మేనకోడలు – మా ఆడపడుచు కూతురు నృత్య ప్రదర్శనకి చేస్తున్న ఏర్పాట్లలో “సావనీర్” ప్రచురించటం ఆలస్యం అయింది. చీటికీ మాటికీ మా ఆడబడుచూ వాళ్లూ “సావనీర్‌” ఎంత వరకు వచ్చిందో అడుగుతూంటే విసుక్కుంటూ “వీళ్లు నన్ను సావనీరు, బతకనీరు” అన్నారు!
————————————————————-
“పద్మదూషణ్‌”
ఎప్పుడూ ఎవరినో ఒకరిని తీవ్రంగా విమర్శించడం అలవాటున్న ఒక మిత్రుడికి “పద్మదూషణ్‌” అని బిరుదిచ్చారు! వరద రాజేశ్వరరావుగారు.
————————————————————-
ఉపన్యాసం

రాజకీయ నాయకుడు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నాడు. “మనరాష్ట్రంలో వంద జైళ్ళు ఉన్నాయి. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఒక్కదాంట్లో ఎప్పుడూ లేం” అన్నాడు. సభలోంచి ఎవరో “ఏ ఒక్కదాంట్లో” అని అరిచారు.
————————————————————-
హనీమూన్‌
శేఖర్‌ సూట్‌కేసుతో నాంపల్లి స్టేషన్‌లో కనిపించగానే మిత్రుడు నరేష్‌ పలకరించాడు. “ఎక్కడికి వెళుతున్నావు?” అన్నాడు నరేష్‌.
“ఊటీకి హనీమూన్‌ వెళుతున్నా” అన్నాడు శేఖర్‌.
“మరి మీ ఆవిడ ఏదీ?” “మా ఆవిడ ఊటీ చూసిందట. అందుకని ఒక్కణ్ణే వెళుతున్నా”.

Tags:    
Advertisement

Similar News